సుశాంత్ ని మాఫియా అలాగే చంపేసింది... కంగనా సంచలన ట్వీట్!

Published : Mar 05, 2021, 08:11 AM ISTUpdated : Mar 05, 2021, 08:43 AM IST
సుశాంత్ ని మాఫియా అలాగే చంపేసింది... కంగనా సంచలన ట్వీట్!

సారాంశం

కంగనా ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ గత వారం 5 లక్షల వరకు తగ్గిపోయారట. దానికి కారణం మూవీ మాఫియా అంటున్నారు ఆమె. ఈ మూవీ మాఫియా మన  ఇమేజ్ నాశనం చేసి మానసిక వేదనకు గురి చేశారు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ని కూడా ఈ మాఫియా ఇలానే చంపేసింది అంటూ ఆమె సంచలన సోషల్ మీడియా పోస్ట్ పెట్టారు.

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంపై మరో మారు సీరియస్ ఆరోపణలు చేశారు ఫైర్ బ్రాండ్ కంగానా రనౌత్. బాలీవుడ్ కి చెందిన మాఫియా సుశాంత్ ని చంపేశారు అంటూ సోషల్ మీడియా వేదికగా సంచలన ఆరోపణలు చేశారు. చాలా కాలంగా కంగానా బాలీవుడ్ పెద్దలపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఆమె నెపోటిజంకి వ్యతిరేకం పోరాడుతున్నారు. ఇక సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణానికి బాలీవుడ్ పెద్దలే కారణం అంటూ ఆమె తీవ్ర ఆరోపణలు చేయడం జరిగింది. తాజాగా మరొమారు బాలీవుడ్ పై విరుచుకుపడ్డారు ఆమె.

కంగనా ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ గత వారం 5 లక్షల వరకు తగ్గిపోయారట. దానికి కారణం మూవీ మాఫియా అంటున్నారు ఆమె. ఈ మూవీ మాఫియా మన  ఇమేజ్ నాశనం చేసి మానసిక వేదనకు గురి చేశారు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ని కూడా ఈ మాఫియా ఇలానే చంపేసింది అంటూ ఆమె సంచలన సోషల్ మీడియా పోస్ట్ పెట్టారు.

కంగనా లేటెస్ట్ పోస్ట్ మరోమారు సుశాంత్ మరణాన్ని గుర్తు చేసింది. బాలీవుడ్ డ్రగ్ మాఫియా గురించి కూడా కంగనా అప్పట్లో సంచలన ఆరోపణలు చేశారు. ఈ విషయంలో మహారాష్ట్ర గవర్నమెంట్ కూడా కంగనాను వ్యతిరేకించింది. మహారాష్ట్ర గవర్నమెంట్ ముంబైలోని కంగనా ఆఫీస్ ని కూల్చివేయ ప్రయత్నించింది.

మరోవైపు కంగాన కొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. తమిళనాడు రాజకీయ సంచలనం జయలలిత బయోపిక్ లో ఆమె నటిస్తున్న విషయం తెలిసిందే.  దర్శకుడు ఏ ఎల్ విజయ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం చిత్రీకరణ  దశలో ఉంది. అలాగే ఓ యాక్షన్ ఎంటర్టైనర్ లో ఆమె నటిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

2025 Flop Heroines: 2025లో ఫ్లాప్ సినిమాలతో పోటీ పడ్డ హీరోయిన్లు.. వాళ్ళిద్దరికీ మూడేసి డిజాస్టర్లు
Sobhan babu జీవితాన్ని ఒక్క సినిమాతో నిలబెట్టిన ఎన్టీఆర్, ఇంతకీ ఆ సినిమా ఏదో తెలుసా?