Isha Chawla: బాలయ్య హీరోయిన్ ఇషా చావ్లాకు కరోనా పాజిటివ్!

Published : Jan 10, 2022, 02:10 PM IST
Isha Chawla: బాలయ్య హీరోయిన్ ఇషా చావ్లాకు కరోనా పాజిటివ్!

సారాంశం

రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. వేలల్లో ఉన్న కరోనా(Corona Virus) రోగుల సంఖ్య రోజుల వ్యవధిలో లక్ష దాటిపోయింది. థర్డ్ వేవ్ సూచనలు కనిపిస్తున్న నేపథ్యంలో ప్రజలు, ప్రభుత్వాలు బెంబేలెత్తుతున్నాయి. కాగా వరుసగా సినిమా స్టార్స్ కరోనా బారినపడుతున్నారు.

సూపర్ స్టార్ మహేష్ (Mahesh Babu)జనవరి 6 గురువారం నాడు తనకు కరోనా పాజిటివ్ అంటూ షాకింగ్ న్యూస్ చెప్పారు. మహేష్ కి కరోనా అని తెలిసిన ఫ్యాన్స్ పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా ఆయన కోలుకోవాలని సందేశాలు పోస్ట్ చేశారు. ఒక్క టాలీవుడ్ లోనే మంచు లక్ష్మి, రాజేంద్ర ప్రసాద్, థమన్, త్రిష, బండ్ల గణేష్ కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం వీరందరూ చికిత్స తీసుకుంటున్నారు. తాజాగా హీరోయిన్ ఇషా చావ్లాకి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆమె ఇంస్టాగ్రామ్ ద్వారా తెలియజేశారు.   ప్రస్తుతం హోమ్ క్వారంటైన్ లో ఉన్న ఇషా చావ్లా అందరూ కూడా డిస్టెన్స్ మైంటైన్ చేస్తూ తగిన జాగ్రత్తలు పాటించి ప్రజలు , సేఫ్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు. అలాగే త్వరలో కరోనా నుండి బయటపడి నేను చేయబోయే తెలుగు సినిమా షూటింగ్ లలో పాల్గొంటానని తెలియజేశారు.

ప్రేమ కావాలి’ చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయం అయిన ఇషా చావ్లా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఎందుకంటే నటసింహ నందమూరి బాలకృష్ణ (Balakrishna) సరసన ఆమె ‘శ్రీమన్నారాయణ’ చిత్రంలో నటించింది. అలాగే 'పూలరంగడు', 'Mr పెళ్ళికొడుకు', జంప్ జిలాని, విరాట్, రంభ ఊర్వశి మేనక, వంటి అనేక చిత్రాలలో నటించి ప్రేక్షకులను మెప్పించిన నటి ఇషా చావ్లా ప్రస్తుతం  కబీర్ లాల్ దర్శకత్వంలో 6 భాషల్లో వస్తున్న "దివ్య దృష్టి" సినిమాలో మెయిన్ లీడ్ గా నటిస్తుంది. ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది.తాజాగా సోషల్ మీడియా మాధ్యమం  ద్వారా తనకు కరోనా సోకినట్టు వెల్లడించింది.

ఇక ఇషా చావ్లా (Isha Chawla) కు కరోనా సోకిందని తెలుసుకున్న అభిమానులు, శ్రేయోభిలాషులు ఆమె త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా కోరుకుంటున్నారు. మరోవైపు థర్డ్ వేవ్ వస్తుందే ఆందోళనలు మొదలయ్యాయి. ఇప్పటికే పాక్షికంగా కరోనా ఆంక్షలు అమలులోకి వచ్చాయి. లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో కొత్త చిత్రాల చిత్రీకరణ, విడుదల ఆగిపోతుంది. పాక్షికంగా అమలవుతున్న కోవిడ్ ఆంక్షల కారణంగా టాలీవుడ్ లో తెరకెక్కిన రెండు పాన్ ఇండియా చిత్రాలు ఆర్ ఆర్ ఆర్, రాధే శ్యామ్ (Radhe Shyam) విడుదల నిలిచిపోయింది. సాధారణ పరిస్థితులు ఏర్పడిన వెంటనే ఈ రెండు బడా చిత్రాలు విడుదల కానున్నాయి. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Akhanda 2 Review: 'అఖండ 2' మూవీ రివ్యూ, రేటింగ్.. బాలకృష్ణ తాండవం ఎలా ఉందో తెలుసా ?
సపోర్ట్ చేసినందుకు వెన్నుపోటు పొడిచిన కళ్యాణ్, మనస్తాపానికి గురైన భరణి.. తనూజ ఏడుపు ఫేక్ అంటూ ముఖం మీదే