కెజియఫ్ కు 5 ఏళ్లు..సైలెంట్ గా వచ్చి.. సెన్సేషన్ క్రియేట్ చేసిన రాఖీ బాయ్..

Published : Dec 22, 2023, 12:22 PM IST
కెజియఫ్ కు 5 ఏళ్లు..సైలెంట్ గా వచ్చి.. సెన్సేషన్ క్రియేట్ చేసిన రాఖీ బాయ్..

సారాంశం

సైలెంట్ గా వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసింది కన్నడ మూవీ కెజియఫ్. కన్నడ స్టార్ హీరో యష్ నటించిన ఈసినిమా రిలీజ్ అయ్యి అప్పుడే 5  ఏళ్ళు అవుతోంది. 

కన్నడ స్టార్ యాక్టర్ యష్ హీరోగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ మూవీ  కెజిఎఫ్. ఈసినిమా ఒక కన్నడ సినిమాగా రిలీజ్ అయ్యింది. సైలెంట్ గా ఇతర భాషల్లోకి డబ్ అయ్యింది. ఇండియా అంతట సెన్సేషన్ అయ్యింది. ఈ సిరీస్ లోని రెండు భారీ పాన్ ఇండియన్ సినిమాలు ఒకదానిని మించేలా మరొకటి ఎంతటి బిగ్గెస్ట్ సక్సెస్ లు సొంతం చేసుకున్నాయో మనకు అందరికీ తెలిసిందే.

ఇక ఈసినిమాలు నిర్మించడంతో  ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలె ఫిలిమ్స్ బ్యానర్ కు దేశ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. అంతే కాదు.. ఈ సినిమాల నిర్మాత విజయ్ కిరగాందూర్ అత్యంత భారీ స్థాయిలో.. పాన్ ఇండియా స్టార్స్ తో సినిమాలు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ తో ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో  నిర్మించిన సలార్.. ఈరోజు రిలీజ్ అయ్యి సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. ఈక్రమంలో కెజియఫ్ కు సంబంధించిన ఓ న్యూస్ వైరల్ అవుతోంది. 

శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ మూవీస్ కి రవి బస్రూర్ సంగీతం అందించగా భువన గౌడ ఫోటోగ్రఫి అందించారు. విషయం ఏమిటంటే, 2018లో సరిగ్గా ఇదే రోజున కెజిఎఫ్ చాప్టర్ 1 మూవీ ఆడియన్స్ ముందుకి వచ్చి పెద్ద సక్సెస్ సొంతం చేసుకుంది. కాగా తమ మూవీ సక్సెస్ఫుల్ గా ఐదేళ్లు పూర్తి చేసుకోవడంతో ఆడియన్స్, ఫ్యాన్స్ కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తూ మేకర్స్ ఒక ప్రత్యేక పోస్టర్ ని రిలీజ్ చేసారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Malliswari Review: బావ మరదలుగా ఎన్టీఆర్, భానుమతి రొమాన్స్, ఫస్ట్ తెలుగు పాన్ వరల్డ్ మూవీగా మల్లీశ్వరి రికార్డు..
500 కోట్ల ధురంధర్, స్టార్ హీరోలను కూడా భయపెడుతున్న రణ్ వీర్ సింగ్ సినిమా