ప్రభాస్ 'శౌర్యాంగ పర్వం' ఎలా ఉండబోతుందో మీ ఊహకే.. సలార్ పార్ట్ 2కి మైండ్ బ్లోయింగ్ టైటిల్

Published : Dec 22, 2023, 12:19 PM IST
ప్రభాస్ 'శౌర్యాంగ పర్వం' ఎలా ఉండబోతుందో మీ ఊహకే.. సలార్ పార్ట్ 2కి మైండ్ బ్లోయింగ్ టైటిల్

సారాంశం

ఫస్ట్ షో నుంచే సలార్ కి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ మొదలైంది. దీనితో సలార్ పార్ట్ 2 పై అంచనాలు ఒక రేంజ్ లో ఉంటాయి. మొదటి భాగం ఎండింగ్ లో ప్రశాంత్ నీల్ పార్ట్ 2 కి సంబందించిన కంప్లీట్ టైటిల్ రివీల్ చేశారు.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వచ్చిన సలార్ హంగామా మొదలైపోయింది. ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తుండగా థియేటర్లు హోరెత్తే జాతర షురూ అయింది. వరల్డ్ వైడ్ గా సలార్ మూవీ ప్రీమియర్ షోలు ప్రారంభం కావడంతో ఫ్యాన్స్ రచ్చ మామూలుగా లేదు. ఆల్రెడీ సలార్ చిత్రానికి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ మొదలైపోయింది. 

థియేటర్ల దగ్గర ప్రభాస్ ఫ్యాన్స్ హంగామా మామూలుగా లేదు. ప్రభాస్ కి ప్రశాంత్ నీల్ లాంటి డైరెక్టర్ తగిలితే సిల్వర్ స్క్రీన్ తగలబడిపోతుంది అని అందరికి తెలుసు. సలార్ పార్ట్ 1కి ఇప్పుడు అదే జరుగుతోంది. సలార్ సీజ్ ఫైర్ అంటూ ప్రశాంత్ నీల్ ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ స్టఫ్ ఇచ్చాడు. కథ కథనాలు ఎలా ఉన్నప్పటికీ ఫ్యాన్స్ ఎంజాయ్ చేసే అంశాలని మాత్రం కళ్ళు చెదిరేలా ప్రజెంట్ చేశారు. 

ఫస్ట్ షో నుంచే సలార్ కి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ మొదలైంది. దీనితో సలార్ పార్ట్ 2 పై అంచనాలు ఒక రేంజ్ లో ఉంటాయి. మొదటి భాగం ఎండింగ్ లో ప్రశాంత్ నీల్ పార్ట్ 2 కి సంబందించిన కంప్లీట్ టైటిల్ రివీల్ చేశారు. రెండవ భాగానికి 'సలార్ పార్ట్ 2- శౌర్యాంగ పర్వం' అని టైటిల్ ఫిక్స్ చేశారు. ఫస్ట్ పార్ట్ లోనే ప్రభాస్ శౌర్యం ఈ రేంజ్ లో ఉంటే.. ఇక అదే టైటిల్ తో వస్తున్న పార్ట్ 2 ఏ రేంజ్ లో ఉంటుందో అని ఆడియన్స్  ఊహకే వదిలేసాడు నీల్. 

సలార్ మూవీ స్లోగా మొదలైనప్పటికీ ప్రీ ఇంటర్వెల్ నుంచి ఆడియన్స్ కనీసం సీట్లలో కూర్చోవడం కూడా కష్టం. ఆ రేంజ్ లో ప్రభాస్ ఉగ్ర రూపం పీక్స్ కి వెళ్ళింది. క్లైమాక్స్ కూడా అదిరిపోయింది. ఆల్రెడీ పార్ట్ 2 టైటిల్ శౌర్యాంగ పర్వం సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Karthika Deepam 2 Latest Episode: జ్యో అరెస్ట్- ఉలుకుపలుకు లేకుండా పడిపోయిన సుమిత్ర-నోరు జారిన పారు
Mowgli Movie Review: మోగ్లీ మూవీ రివ్యూ, రేటింగ్‌.. సుమ కనకాల కొడుక్కి ఎట్టకేలకు హిట్‌ పడిందా?