
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్ తో తెరకెక్కిన భారీ బడ్జెట్ సినిమా సలార్. ఈసినిమా కోసం వెయ్యి కళ్లతో ఎదరు చూసిన అభిమానుల కోసం.. అదరిపోయే విజ్యూవల్ ట్రీట్ ఇచ్చాడు ప్రశాంత్ నీల్. ఇక ప్రభాస్ నటనతో పాటు.. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ ఫ్యాన్స్ ను ఇంకోలోకంలోకి తీసుకెళ్ళాయి అని చెప్పాలి. ఈక్రమంలో సలార్ సినిమా కోసం ప్రభాస్ అభిమానుల సందడి అంతా ఇంతా కాదు. వారు పండగ చేసుకుంటున్నారు.
సలార్ రెండు పార్ట్ లు గా తెరకెక్కుతోంది. ఈక్రమంలో మొదటి భాగం ఈరోజు ( డిసెంబర్ 22) ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. దీంతో థియేటర్స్ వద్ద అభిమానుల సందడి కనిపిస్తుంది. నిన్నరాత్రి నుంచే సెలబ్రేషన్స్ మొదలు కావడంతో థియేటర్స్ వద్ద కోలాహలంగా ఉంది. అయితే ఈ సందడి ఒక అపశృతి చోటు చేసుకుంది. రిలీజ్ సెలబ్రేషన్స్ లో ఉన్న ఒక అభిమాని కరెంట్ షాక్ తగిలి మృతి చెందిన ఘటన ఫ్యాన్స్ ను కలిచివేస్తోంది.
Salaar Twitter Review: సలార్ మూవీ ట్విట్టర్ రివ్యూ, ప్రభాస్ సాలిడ్ కమ్ బ్యాక్.. ఇక రచ్చ రచ్చే...
శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని రంగ థియేటర్ లో సలార్ సినిమా ఫ్లెక్సీ కడుతుండగా ఈ ప్రమాదం జరిగింది. 29 ఏళ్ళ బాలరాజు అనే ప్రభాస్ అభిమాని .. థియేటర్ వద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తున్నాడు. ఆ సమయంలో ఫ్లెక్సీకి ఉన్న ఇనుప ఫ్రేమ్ కరెంట్ తీగలకు తగలడంతో విద్యుత్ ఫ్రేమ్ ద్వారా ప్రసరించి.. షాక్ కి గురయ్యాడు. ప్రమాదంలో అతడు అక్కడిక్కడే మరణించినట్లు తెలుస్తుంది.
ఇక ఈ ఘటనతో బాలరాజు కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయారు. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.అంతే కాదు బాలరాజు కుటుంబ సభ్యులు, బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరెంటు తీగలు తక్కువ ఎత్తులో ఉండడం వల్లే ప్రమాదం జరిగిందని ఆరోపిస్తున్నారు.ఈ ఘటన తోటి ప్రభాస్ అభిమానులను బాధకి గురి చేస్తుంది. రాకరాక ప్రభాస్ నుంచి తాము అనుకున్న మంచి సినిమా రావడంతో.. ఎంజాయ్ చేయాలి అనుకున్న వారికి ఈ ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.