కాలినడకన తిరుమల కొండెక్కిన విశ్వక్ సేన్, ధమ్కీ సక్సెస్ కోసం శ్రీవారికి మాస్ హీరో పూజలు

Published : Mar 20, 2023, 01:54 PM IST
కాలినడకన తిరుమల కొండెక్కిన విశ్వక్ సేన్, ధమ్కీ సక్సెస్ కోసం శ్రీవారికి మాస్ హీరో  పూజలు

సారాంశం

టాలీవుడ్ యంగ్ హీరో.. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన తాజా మూవీ ధమ్కీ. తానే డైరెక్టర్ గా.. హీరోగా చేసిన ఈసినిమా సక్సెస్ కోసం విశ్వక్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు.తాజాగా తిరుమల తిరుపతి కొండను కాలినడకన ఎక్కి.. శ్రీవారిని దర్శించుకున్నాడు యంగ్ హీర్. 

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటిస్తున్న తాజా సినిమా ధమ్కీ.  విశ్వక్ స్వీయ దర్శకత్వంలో  తెరకెక్కిస్తున్న ఈసినిమా రిలీజ్ కు ముస్తాబవుతుంది.  విశ్వక్ సేన్ కెరీర్ లో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈసినిమా  సూపర్ హిట్ అవ్వాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు విశ్వక్ సేన్. ఈ నేపథ్యంలోనే అన్ని అనుకున్నట్లు జరగాలి అని తిరుమల శ్రీవారిని మొక్కుకునేందుకు ఈరోజు (మార్చి 20) ఉదయం తిరుపతి చేరుకున్నాడు. కాలినడకన మెట్లు ఎక్కుతూ.. శ్రీవారిని చేరుకున్నాడు విశ్వక్. అనంతరం ఉదయం తిరుమలవాసుని దర్శనం చేసుకుని తీర్ధ ప్రసాదాలు స్వీకరించాడు. ఈసందర్భంగా మీడియాకు కనిపించి ఫోటోలకుఫోజులిచ్చారు విశ్వక్ అండ్ టీమ్. 

యంగ్ హీరో డైరెక్ట్ చేసిన  రెండో సినిమా ఇది. గతంలో ఫ‌ల‌క్‌నుమాదాస్ లో నటిస్తూ.. డైరెక్ట్ చేశాడు యంగ్ హీరో.  ఇక పాగల్ సినిమాతో హిట్ కాంబినేషన్ అనిపించుకున్న విశ్వక్ అండ్ నివేత పేతురేజ్ మరోసారి ఈ సినిమాలో జంటగా కనిపించబోతున్నారు. యాక్షన్ కామెడీగా తెరకెక్కుతున్న ధమ్కీ  సినిమాకి ప్రసన్న కుమార్ బెజవాడ కథని అందిస్తున్నాడు.  తన కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కడం, దర్శకుడు కూడా తానే కావడంతో.. ఎలాగైనా గట్టి హిట్ కొట్టాలని చూస్తున్నాడు విశ్వక్ సేన్. 

ఇక ఈ సినిమాను హిట్ చేయాలనే పట్టుదలతోనే..  ప్రీ రిలీజ్ ఈవెంట్ కి జూనియర్ ఎన్టీఆర్ ని గెస్ట్ గా తీసుకొచ్చాడు విశ్వక్.  ఎన్టీఆర్ ఫాన్స్ సపోర్ట్ ని సంపాదించుకున్నాడు. అంతే కాదు  బాలయ్య ఫాన్స్ సపోర్ట్ కూడా సాధించాడు మాస్ కా దాస్.  అన్ స్టాపబుల్ లో విశ్వక్ కు ఫుల్ సపోర్ట్ ప్రకటించాడు బాలకృష్ణ. ఇక ప్రీ రిలీజ్ ఆవెంట్ లో కూడా తారక్ విశ్వక్ టాలెంట్ ను ఆకాశానికి ఎత్తుతూ పొగడ్తలతో ముంచెత్తాడు. ఎన్టీఆర్ పాయింట్ టు పాయింట్ మాట్లాడుతుంటే.. విశ్వక్ మీద ఉన్న కాస్త నెగెటీవ్ ఫీలింగ్ కూడా పారిపోయిందంటున్నారు ఫ్యాన్స్. ఇక అన్నీ  అనుకున్నట్లు జరిగితే సినిమా భారీ ఓపెనింగ్స్ రావడం ఖాయంగా తెలుస్తోంది. 

ఇక ఈ సినిమాతో విశ్వక్  సేన్ పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగు పెడుతున్నాడు. ఈ నెల 22న ఉగాది సందర్భంగా పాన్ ఇండియా వైడ్ ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. మరి ఈ సినిమా విశ్వక్ కి ఏ రేంజ్ హిట్టు అందిస్తుందో చూడాలి. రావు రమేష్, అజయ్, తరుణ భాస్కర్, హైపర్ ఆది, అక్షర గౌడ్ తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్న  ఈ సినిమాని కరాటే రాజ్, విశ్వక్ సేన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తుండగా, రామ్ మిరియాల ఒక పాటకి మ్యూజిక్ ఇస్తున్నాడు. 

PREV
click me!

Recommended Stories

Thalapathy Vijay సినిమా స్టోరీ లీక్, జన నాయగన్ కథ ఇదేనా? షాక్ లో మూవీ టీమ్
Pawan Kalyan కోసం రామ్ చరణ్ త్యాగం? పెద్ది రిలీజ్ పై మెగా అభిమానుల్లో ఆందోళన