'కబ్జ2' లో పవన్ కళ్యాణ్.. అంటూ పోస్టర్, కాకపోతే..

Published : Mar 20, 2023, 01:39 PM ISTUpdated : Mar 20, 2023, 01:50 PM IST
 'కబ్జ2' లో పవన్ కళ్యాణ్.. అంటూ పోస్టర్, కాకపోతే..

సారాంశం

ఈ పోస్టర్ లో ఉపేంద్ర, కిచ్చా సుదీప్ లతో పాటు పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు. పవన్ కళ్యాణ్ సీక్వెల్ లో  కీలక పాత్ర పోషించడానికి ఓకే చేసారంటూ చెప్తున్నారు. 


ఉపేంద్ర తాజా చిత్రం క‌బ్జ  రిజల్ట్ సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారింది. గ్యాంగ్‌స్ట‌ర్ క‌థాంశంతో రూపొందిన ఈ సినిమా మార్చి 17న పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో ద‌క్షిణాది భాష‌ల‌తో పాటు హిందీలో రిలీజైంది. ఈ సినిమాకు ఆర్ చంద్రు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. క‌బ్జ సినిమా క‌థ‌, యాక్ష‌న్ సీన్స్ కేజీఎఫ్ సినిమాను పోలి ఉండ‌టంపై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లొస్తున్నాయి. రొటీన్ గ్యాంగ్‌స్ట‌ర్ క‌థాంశంతో రూపొందిన ఈ సినిమా క‌న్న‌డంతో పాటు మిగిలిన భాష‌ల్లోనూ ప్లాఫ్ టాక్ తెచ్చుకుంది.  ఈ నేపధ్యంలో ఈ చిత్రంపై హైప్ క్రియేట్ చేసేందుకు ఫేక్ పోస్టర్స్, ఫేక్ కలెక్షన్స్ తో ప్రచారం మొదలైంది.

సినిమా క్లైమాక్స్ లో  కబ్జ 2 అంటూ క్లూ ఇచ్చారు. దాంతో ఇప్పుడు కబ్జ 2 పోస్టర్ అంటూ ఒకటి నెట్ లో అభిమానులతో రెడీ అయ్యి..వైరల్ అవుతోంది. అందులో విశేషం ఏమిటంటే... ఈ పోస్టర్ లో ఉపేంద్ర, కిచ్చా సుదీప్ లతో పాటు పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు. పవన్ కళ్యాణ్ సీక్వెల్ లో  కీలక పాత్ర పోషించడానికి ఓకే చేసారంటూ చెప్తున్నారు. ఫ్యాన్స్ మేడ్ క్రియేటివ్ పీస్‌గా ఉన్న ఈ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కొందరు తిట్టిపోస్తూంటే మరికొందరు ..పవన్ ఫొటో లేకపోతే ఈ  కన్నడ సినిమాకు కూడా పబ్లిసిటీ లేదు, ఎవరు పట్టించుకోరు అందుకే ఇలా చేస్తున్నారు అంటున్నారు. 

వాస్తవానిక  కబ్జా ఆడియో లాంచ్  కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ ని గెస్ట్ గా ఆహ్వానించారట. కానీ జనసేన పార్టీ కార్యక్రమాలు ఉండటం, పవన్ కళ్యాణ్ బిజీగా ఉండటంతో ఈ కార్యక్రమానికి వెళ్లలేకపోయారు. దీంతో తానూ రాలేకపోయినందుకు బాధపడుతున్నాను అంటూ పవన్ అధికారికంగా ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు.ఈ ప్రెస్ నోట్ లో కబ్జా సినిమా ఆడియో లాంచ్ కి నన్ను అతిథిగా ఆహ్వానించారు. కానీ ముందే ఫిక్స్ అయి ఆన్న జనసేన పార్టీ కార్యక్రమాల వల్ల నేను ఈ కార్యక్రమానికి రాలేకపోతున్నందుకు చింతిస్తున్నాను. 

హీరోలుగా నటించిన ఉపేంద్ర గారికి, సుదీప్ గారికి బెస్ట్ విషెష్ తెలియచేస్తున్నాను. వారిద్దరూ వేరే భాషల్లో కూడా వారి నటనతో మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ సినిమా మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చిత్ర దర్శకుడు చంద్రు, నిర్మాత రామచంద్ర గౌడ, మిగిలిన చిత్ర యూనిట్ కు నా అభినందనలు అని పోస్ట్ చేశారు. దీంతో పవన్ కళ్యాణ్ రిలీజ్ చేసిన ఈ ప్రెస్ నోట్ వైరల్ గా మారింది.

ప్రస్తుతం పవన్ కల్యాణ్.. తమిళ మూవీ వినోధాయ సిద్ధం రీమేక్ చేస్తున్నాడు. సముద్రఖని డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ కూడా నటిస్తున్నాడు. తమిళంలో సముద్రఖని పోషించిన పాత్రనే తెలుగులో పవన్ చేస్తున్నాడు. తెలుగులో త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రిప్ట్ అందించాడు. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా రాబోతోంది.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Avatar 3 Review: అవతార్‌ 3 మూవీ రివ్యూ, రేటింగ్‌.. జేమ్స్ కామెరూన్‌ ఇక ఇది ఆపేయడం బెటర్‌
Chiranjeevi, Mahesh Babu సినిమాలతో పోటీ పడి టాప్ 5లో నిలిచిన హీరో, టాలీవుడ్ రాజకీయాలపై ఓపెన్ కామెంట్స్