
వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్నాడు యంగ్ హీరో నిఖిల్. టాలీవుడ్ నుంచి పాన్ఇండియా స్థయిలో ఇమేజ్ ను సాధించాడు నిఖిల్. గత ఏడాది నిఖిల్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ కార్తికేయ-2.... ఐదు భాషల్లో అద్భుతమైన విజయం సాధించింది. ఓన్లీ15 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 121 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమాతో నిఖిల్ కి బాలీవుడ్ నుంచి కూడా మంచి గుర్తింపు వచ్చింది. ఇక ఈసారి నార్త్ నుంచి మరో ఘనత సాధించాడు నిఖిల్. బాలీవుడ్ నుంచి కార్తికేయ సినిమాకు నిఖిల్ నార్త్ లో అవార్డ్ కూడా అందుకున్నాడు. ఈ విషయాన్ని బాలీవుడ్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది.
తాజాగా ఈ సినిమాకి నిఖిల్ నార్త్ లో అవార్డ్ కూడా అందుకున్నాడు. బాలీవుడ్ లో ఇచ్చే ప్రముఖ ఐకానిక్ గోల్డ్ అవార్డ్స్ ఇటీవల ముంబైలో గ్రాండ్ గా జరిగాయి. 2022 గాను కార్తికేయ2 సినిమాకి పాపులర్ ఛాయస్ కేటగిరీలో బెస్ట్ యాక్టర్ గా నిఖిల్ కి అవార్డుని అందుకున్నారు. ఈ విషయాన్ని ప్రచారంచేస్తూ.. బాలీవుడ్ మీడియా పెద్ద ఎత్తున కథనాలు ప్రసారం చేసింది. అంతే కాదు నిఖిల్ ను పాన్ ఇండియా స్టార్ అంటూ.. ఆకాశానికి ఎత్తేసింది. నేషనల్ లెవెల్ బిగ్ స్టార్ నిఖిల్ అక్కడి ప్రింట్ మీడియా రాసుకొచ్చారు. హ్యాపీ డేస్ సినిమాలో వన్ అఫ్ ది యాక్టర్ గా పరిచయమైన నిఖిల్.. నేడు బాలీవుడ్ స్టార్ అనిపించుకునే రేంజ్ కు ఎదిగారు.
బాలీవుడ్ లో తన డెబ్యూట్ తోనే ఈరేంజ్ హిట్ సాదించడం..అది కూడా సౌత్ హీరోను బాలీవుడ్ జనాలు ఆదరించడం టాలీవుడ్ కు దక్కిన గౌరవంగా ఫీల్ అవుతున్నారు. బాలీవుడ్ లో మొదటి సినిమాతోనే స్టార్ గా ఎదిగిన నిఖిల్ ను టాలీవుడ్ ఆడియన్స్ అభినందిస్తున్నారు.గత ఏడాది రిలీజ్ అయిన కార్తికేయ-2. 2014లో వచ్చిన కార్తికేయ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కిందీ సినిమా. ఈ రెండు సినిమాలను యంగ్ డైరెక్టర్ చందు ముండేటినే దర్శకత్వం వహించాడు. అభిషేక్ అగర్వాల్ నిర్మించిన నిర్మాణంలో యాక్షన్ అడ్వెంచర్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా ఎటువంటి అంచనాలు లేకుండా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అయ్యి కాసుల వర్షం కురిపించింది. ఈ సినిమాతో నిఖిల్ కి నార్త్ లో మంచి గుర్తింపు లభించింది.
ఇక వరుస హిట్ల జోష్ లో నిఖిల్ ప్రస్తుతం స్పై అనే యాక్షన్ థ్రిల్లర్ మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమా కూడా పాన్ ఇండియాను దృష్టిలో పెట్టుకుని తెరకెక్కిస్తున్నారు. క్షణం, గూఢచారి, ఎవరు, హిట్-1,2 సినిమాలకు ఎడిటర్ గా, అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన గర్రి బిహెచ్ ఈ సినిమా కు డైరెక్టగా వ్యవహరిస్తున్నాడు. ఈ మూవీలో నిఖిల్ కి జోడిగా తమిళ హీరోయిన్ ఐశ్వర్య మీనన్ నటిస్తుంది. ఈడి ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై కె రాజశేఖర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈమూవీ నుంచి నిఖిల్ కు సబంధించిన అప్ డేట్స్ కొన్ని రిలీజ్ అయ్యాయి.అవి సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి.