కెప్టెన్ విజయ్ కాంత్ కు విశాల్ నివాళి, నడిగర్ సంఘ భవనానికి విజయ్ కాంత్ పేరు..?

By Mahesh JujjuriFirst Published Jan 10, 2024, 1:40 PM IST
Highlights

తమిళ హీరో విశాల్ ఎమోషనల్ అయ్యారు. తమిళ స్టార్ హీరో..దివంగత విజయ్ కాంత్ మెమోరియల్ ను సందర్భించిన ఆయన కెప్టెన్ కు ఘనంగా నివాళి అర్పించారు.

తమిళ స్టార్ హీరో.. రాజకీయ నాయకులు విజయ్ కాంత్ మరణించిన రెండు వారాల తరువాత  ఆయనసమాధిని సందర్శించారు తమిల స్టార్ హీరోవిశాల్. విజయ్ కాంత్ మరణించిన సమయంలో విదేశాల్లో ఉన్న హీరోలంతా.. చెన్నైకి రాగానే విజయ్ కాంత్ కు నివాళి అర్పించేందకు క్యూ కడుతున్నారు. సూర్య,లారెన్స్, కార్తి, శివకార్తికేయన్ లాంటియంగ్ హీరోలతో పాటు.. తాజాగా విశాల్ కూడా కెప్టెన్ సమాధినిసందర్శించారు.  

సినీనటుడు, డీఎండీ అధినేత కెప్టెన్ విజయకాంత్ అనారోగ్యంతో డిసెంబర్ 28న కన్నుమూశారు. ఆయన మరణించిన సమయంలో నూతన సంవత్సర వేడుకల కోసం విదేశాలకు వెళ్లిన విశాల్ .. విజయ్ కాంత్ కు నివాళి అర్పించారు.  విదేశాల నుంచి తిరిగి వచ్చిన తర్వాత కెప్టెన్ విజయకాంత్ స్మారక చిహ్నం వద్ద ప్రముఖులు ఒక్కొక్కరుగా నివాళులు అర్పిస్తున్నారు. అమెరికా నుంచి తిరిగొచ్చిన నటుడు విశాల్ ఈరోజు ఉదయం 11 గంటలకు కెప్టెన్ విజయకాంత్ స్మారకం వద్దకు వెళ్లి నివాళులర్పించారు. 

Latest Videos

 

విశాల్ వెంట అతని స్నేహితుడు నటుడు ఆర్య కూడా  ఉన్నారు. ఇద్దరు  వచ్చి కెప్టెన్ సమాధి వద్ద నివాళులర్పించారు. కుటుంభ సవ్యులను ఓదార్చారు. ఆ తర్వాత విశాల్ మాట్లాడుతూ.. ‘‘సాధారణంగా ఒక వ్యక్తిని భూలోకం నుంచి వెళ్లిన తర్వాతే దేవుడిగా కొలుస్తాము.. కాని కానీ కెప్టెన్ బతికి ఉండగానే ప్రజల మనసుల్లో దేవుడిగా నిలిచాడు. ఎంత మంచి వారు కాకపోతే ప్రజలు కెప్టెన్ ను అలా కొలుస్తారు.. నటీనటులకు ఎంతో మేలు చేశారు. నడిగర్ సంఘం అధ్యక్షులుగా ఎంతో సేవ చేశారు. పేద కళాకారులను ఆదుకున్నారు.. 

సూపర్ స్టార్ రజినీకాంత్ దూకుడు.. లైన్ లో 4 సినిమాలు, తగ్గేది లేదంటున్న తలైవా..

విజయకాంత్‌ మనందరికీ ఆదర్శం. నటులు, రాజకీయ నాయకులు, సామాజిక సేవకుల్లో విజయకాంత్ అత్యంత ప్రజాదరణ పొందిన వ్యక్తి.  అంత మంచి వ్యక్తి అంత్యక్రియలకు హాజరు కాలేనందుకు చాలా బాధపడ్డాను.అందుకే అందరి సమక్ష్యంలో కెప్టెన్ కు క్షమాపణలు కోరకుంటున్నాను అని అన్నారు. ఇక విజయ్ కాంత్ మరణంతో.. కొత్తగా నిర్మించిన నడిఘర్ సంఘ భవనానికి విజయ్ కాంత్ పేరు పెట్టాలన్న డిమాండ్ వినిపిస్తుంది. పలువురు స్టార్స్ కూడా ఈ విషయాన్ని బాహాటంగానే చెప్పుతున్నారు. ఈక్రమంలో విశాల్ స్పందించారు. 

కెప్టెన్ ఇప్పుడు మన మధ్య లేకపోయినా, అతను మన హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాడు. నటీనటుల సంఘం భవనానికి కచ్చితంగా విజయకాంత్ పేరు పెడతామన్నారు. నటీనటుల సంఘం కోసం ఆయన చేసిన కృషి సామాన్యమైనది కాదు. అందుకే విజయ్ కాంత్ కు  నివాళులర్పించేందుకు జనవరి 19న సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. స్టార్స్ అంతా అందులో పాల్గొని నివాళి అర్పించి... అప్పుడే అనౌన్స్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 

click me!