హను మాన్ ప్రీమియర్ షోలకు మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్.. ఇదే ఊపు కొనసాగితే.. 

Published : Jan 10, 2024, 12:13 PM ISTUpdated : Jan 10, 2024, 12:14 PM IST
హను మాన్ ప్రీమియర్ షోలకు మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్.. ఇదే ఊపు కొనసాగితే.. 

సారాంశం

చైల్డ్ ఆర్టిస్ట్ గా క్రేజ్ సొంతం చేసుకున్న తేజ సజ్జా ప్రస్తుతం హీరోగా ఒక్కో మెట్టు ఎదుగుతున్నాడు. ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తాజా చిత్రం హను మాన్.

చైల్డ్ ఆర్టిస్ట్ గా క్రేజ్ సొంతం చేసుకున్న తేజ సజ్జా ప్రస్తుతం హీరోగా ఒక్కో మెట్టు ఎదుగుతున్నాడు. ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తాజా చిత్రం హను మాన్. సంక్రాంతి బారిలో గుంటూరు కారం, సైంధవ్ లాంటి స్టార్ హీరోల సినిమాలు ఉన్నప్పటికీ హను మాన్ చిత్రంపై కూడా ఆసక్తి నెలకొంది. 

ఆంజనేయస్వామి బ్యాక్ డ్రాప్ లో ప్రశాంత్ వర్మ ఒక ఆసక్తికరమైన సూపర్ హీరో కథతో వస్తున్నారు. గురువారం రోజు తెలుగు రాష్ట్రాల్లో హను మాన్ టీం ప్రీమియర్ షోలకు ప్లాన్ చేసింది. అస్సలు ఊహించని విధంగా ప్రీమియర్ షోల టికెట్లన్నీ అమ్ముడయ్యాయి. ఇది నిజంగా షాకింగ్ అనే చెప్పాలి. 

ఏపీ, తెలంగాణాలో ప్రధాన నగరాల్లో 40 ప్రీమియర్ షోలని ప్లాన్ చేశారు. ఆ షోల టికెట్లన్నీ అమ్ముడు కావడం విశేషం. హను మాన్ చిత్రం కోసం ఆడియన్స్ ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. 

ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వస్తే సంక్రాంతి సినిమాలకు గట్టి పోటీ ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ లో మంచి రెస్పాన్స్ వచ్చింది. విజువల్ అద్భుతంగా ఉన్నాయి. అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలో నటిస్తోంది. 

 డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ చిత్రానికి 2 గంటల 38 నిమిషాల రన్ టైమ్ ఫైనల్ చేశారు.  యాక్షన్ అంశాలు భారీ పాన్ ఇండియా చిత్రాలకు ధీటుగా తెలుస్తోంది.   హను మాన్ రిలీజ్ అవుతున్న రోజే సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం చిత్రం కూడా రిలీజ్ అవుతోంది. దీనితో అభిమానుల్లో ఉత్కంఠ మరింతగా పెరిగిపోతోంది.

PREV
click me!

Recommended Stories

Akhanda 2: అఖండ 2 రిలీజ్ కి తొలగిన అడ్డంకులు, మద్రాస్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. కానీ ఆ ఒక్క సమస్య ఇంకా ఉంది
Prabhas in Japan: జపాన్ లో భూకంపం నుంచి ప్రభాస్ సేఫ్.. హమ్మయ్య, రెబల్ స్టార్ కి గండం తప్పింది