నేను మోహన్ బాబు ఇంట్లోనే పెరిగా.. కానీ మా అమ్మని తిడితే : తనీష్ ఎమోషనల్

By Siva KodatiFirst Published Oct 12, 2021, 6:07 PM IST
Highlights

మా ఎన్నికల సందర్భంగా తాను ఏ ఒక్కరోజూ మీడియా మందుకు రాలేదన్నారు యువ హీరో తనీష్. మంగళవారం ప్రకాశ్ రాజ్ ప్యానెల్‌లోని 11 మంది సభ్యులు రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో తనీష్ మాట్లాడారు. 

మా ఎన్నికల సందర్భంగా తాను ఏ ఒక్కరోజూ మీడియా మందుకు రాలేదన్నారు యువ హీరో తనీష్. మంగళవారం ప్రకాశ్ రాజ్ ప్యానెల్‌లోని 11 మంది సభ్యులు రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో తనీష్ మాట్లాడారు. ఒకరిని అనడం గానీ.. ఒకరి నుంచి మాటలు పడటం వంటి వాటికి దూరంగానే వుంటానని తనీష్ చెప్పారు. మా ఎన్నికల్లో తనకు ఓటు వేసి గెలిపించిన మా సభ్యులందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అయితే అలాంటి వారంతా రాజీనామా చేసినందుకు తనను క్షమించాలని తనీష్ కోరారు. చాలా మందికి తన ప్యానెల్ ఎజెండా గురించి చెప్పడానికి ఫోన్ చేస్తే.. వారంతా తాను మాలో వుంటే మంచిదని వారు సూచించారని ఆయన గుర్తుచేశారు.

కృష్ణానగర్ నుంచి ఈ స్థాయికి ఎదిగిన నీలాంటి వ్యక్తి వల్లే తమ సమస్యలు పరిష్కారమవుతాయని వారు తనతో చెప్పారని తనీష్ వెల్లడించారు. ఈ నిర్ణయం తీసుకున్నది ‘‘మా’’ మంచికేనని తనీష్ వెల్లడించారు. ప్యానెల్ మొత్తం గెలిస్తేనే ఏదైనా మంచి పని చేయడానికి వీలవుతుందన్నారు. గతంలో కూడా తాను ఈసీ మెంబర్‌గా పనిచేశానని.. నరేశ్ మా అధ్యక్షుడిగా వున్న సమయంలో చాలా గొడవలు జరిగాయని తనీశ్ ఆరోపించారు. అభిప్రాయాలు వేరు వేరు కావడం వల్ల ఈసీ మీటింగ్స్‌లో చాలా గొడవలు జరిగేవని చెప్పారు. అయితే కొందరు తమను పనిచేయనివ్వలేదని నరేశ్ చాలా ఇంటర్వ్యూలలో చెప్పారని.. తాము కేవలం ఈసీ మెంబర్స్ మాత్రమేనని తనీశ్ వెల్లడించారు.

Also Read:మోహన్‌బాబు అమ్మనా బూతులు తిట్టారు.. మంచు లక్ష్మీ, విష్ణులను ఎత్తుకుని తిరిగా.. బోరున విలపించిన బెనర్జీ

ఇప్పుడు అలాంటి సమస్యలు రాకూడదని ఆయన ఆకాంక్షించారు. ప్రకాశ్ రాజ్ భావజాలం, సిద్ధాంతాలు నచ్చి తాను ఆయన ప్యానెల్ వైపు వచ్చానన్నారు. తనకు మోహన్ బాబు, విష్ణు, మనోజ్ అంటే ఇష్టమేనని తనీష్ స్పష్టం చేశారు. తనను మోహన్ బాబు బూతులు తిట్టి తనపైకి వచ్చారని... ఇది చూసిన బెనర్జీ తనను రక్షించడానికి మోహన్ బాబుకి అడ్డు తగిలారని తనీష్ చెప్పారు. ఈ సమయంలోనే బెనర్జీని కూడా మోహన్ బాబు దూషించారని .. తన వల్ల మాటలు పడినందుకు బెనర్జీకి క్షమాపణలు చెబుతున్నానని అన్నారు. దీంతో ఆ రోజు తనకు ఏడుపు వచ్చేసిందని.. విష్ణు, మనోజ్‌లు వచ్చి తనను ఓదార్చారని తనీష్ వెల్లడించారు. మోహన్ బాబు ఇంట్లోనే తాను పెరిగానని.. అయితే తన తల్లిని కించపరిచేలా దూషించడంతోనే ఏమోషనల్ అయ్యానని అన్నారు. ఈసీ మీటింగ్స్ జరిగినప్పుడు వెళ్లాలని ఆ సమయంలో ఏమైనా చెప్పాలనపిస్తే భయం వేస్తుందని తనీష్ ఉద్వేగానికి గురయ్యారు. తన రాజీనామా వల్ల బాధపడితే క్షమించాలని విష్ణు, మనోజ్‌లు క్షమించాలని కోరారు. 
 

click me!