సూర్యతో సీక్వెల్ మూవీ ప్లాన్ చేస్తోన్న విక్రమ్ కుమార్, మరో ప్రయోగానికి శ్రీకారం

Published : Jul 15, 2022, 01:14 PM IST
సూర్యతో సీక్వెల్ మూవీ ప్లాన్ చేస్తోన్న విక్రమ్ కుమార్, మరో ప్రయోగానికి  శ్రీకారం

సారాంశం

మరో ప్రయోగానికి రెడీ అవుతున్నాడు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ విక్రమ్ కుమార్. అది కూడా ప్రయోగాత్మక సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన తమిళ స్టార్ హీరోతో.. సీక్వెల్ మూవీ ప్లాన్ చేస్తున్నాడు.  

తెలుగు, తమిళ భాషల్లో  విక్రమ్ కుమార్ కి దర్శకుడిగా మంచి పేరు ఉంది. మనం లాంటి సినిమాలతో ఆయన తన ఇమేజ్ ను పదిలం చేసుకున్నారు. విభిన్నంగా ,విలక్షణంగా సినిమాలు చేయడంతో విక్రమ్ కుమార్ మార్క్ ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటుంది. కథలో కొత్తదనం, పాత్రల్లో వైవిధ్యం విక్రమ్ కుమార్ సినిమాల్లో కనిపించే  పక్కా క్వాలిటీస్.  ప్రస్తుతం విక్రమ్ కుమార్ నాగచైతన్యా హీరోగా థ్యాంక్యూ సినిమా రూపొందిస్తున్నారు. ఈ సినిమా  ఈ నెల 22 ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కు రెడీ అవుతోంది. 

నాగ చైతన్య  - రాశి ఖన్నా జంటగా తెరకెక్కిన ఈసినిమాను  దిల్ రాజు నిర్మించారు.  రిలీజ్ డేట్ కూడా దగ్గర పడుతుండటంతో  సినిమా, ప్రమోషన్స్ వేగాన్ని పెంచారు టీమ్. ఇక ఈ సినిమాకు సంబంధించిన తాజా ఇంటర్యూలో విక్రమ్ కుమార్ ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించారు. సూర్యతో గతంలో 24 సినిమా చేసిన విక్రమ్ కుమార్ మళ్లీ మరోసారి  24  సినిమా ప్రస్తావన తెచ్చారు. అంతే కాదు ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందన్న హింట్ ఇచ్చారు విక్రమ్ కుమార్.  

నిజంగా ఆ సినిమా ఒక ప్రయోగమని అన్నారు విక్రమ్ కుమార్ 24 సినిమాకు  సీక్వెల్ చేయమని చాలామంది అడుగుతున్నారని, తాను కూడా ఎప్పటి నుంచో అదే ఆలోచనలో ఉన్నానన్నారు.  సూర్య హీరోగా 24 మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. తెలుగు తమిళ భాషల్లో ఆడియన్స్ ఈ సినిమాను బాగా రిసీవ్ చేసుకున్నారు. ఇక ఈ సినిమాకు సీక్వెల్ వస్తే... ఇంకా బాగుంటుంది అన్న అభిప్రాయం ఆడియన్స్ లో ఉంది. 

అటు సూర్య కూడా ప్రయోగాలంటే బాగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటాడు. కథలో కొత్తదనం, థ్రిల్లింగ్ కాన్సెప్ట్ లతో ఆడియన్స్ ను అలరించడానికి చూస్తుంటాడు. 24 మూవీ కూడా అలా చేసింది. ఇక ఈసినిమాకు సీక్వెల్ విషయంలో కూడా సూర్య తప్పక ఒప్పుకుంటారన్న నమ్మకాన్ని డైరెక్టర్ కాన్ఫిడెంట్ తో ఉన్నాడు. అయితే ఒక వేళ 24 మూవీ సీక్వెల్ చేస్తే... దానికి చాలా టైమ్ తో  పాటుచాలా శ్రమ చేయవలసి వస్తుంది అన్నారు విక్రమ్ కుమార్. 

అయితే తాను మాత్రం సూర్యతోనే 24  సీక్వెల్ చేయాలని భావిస్తున్నాను అన్నారు విక్రమ్. అందుకు అన్నీ రకాలుగా ఏ ఇబ్బందులు లేకుండా.. అన్నీ.. కుదరాలని  కోరుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చారు.  ఇక ప్రస్తుతం విక్రమ్ కుమార్  దూత అనే వెబ్ సిరీస్ తో పాటు టాలీవుడ్ లో ఒక సినిమా .. బాలీవుడ్ లో ఒక సినిమా చేయనున్నారు. వీటి తరువాత 24 సీక్వెల్ ఉండే అవకాశం కనిపిస్తోంది. 
 

PREV
click me!

Recommended Stories

Sanjana Remuneration : విన్నర్ రేంజ్ లో పారితోషికం అందుకున్న సంజన గల్రానీ, 15 వారాలు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నందుకు ఎంత ఇచ్చారంటే?
Bigg Boss Telugu 9 : తనూజ తో ఐటమ్ సాంగ్ చేయిస్తానన్న ఇమ్మాన్యుయేల్, అడ్డంగా బుక్కైన డీమాన్ పవన్.. హౌస్ లో చివరి రోజు సందడి