The Warriorr: హ్యాట్రిక్ విజయాల కృతి శెట్టి జోరుకు బ్రేక్... ఫస్ట్ ప్లాప్ పడ్డట్లేనా!

Published : Jul 15, 2022, 11:10 AM IST
The Warriorr: హ్యాట్రిక్ విజయాల కృతి శెట్టి జోరుకు బ్రేక్... ఫస్ట్ ప్లాప్ పడ్డట్లేనా!

సారాంశం

లక్కీ లేడీ కృతి శెట్టికి కెరీర్ లో ఫస్ట్ ప్లాప్ పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఆమె లేటెస్ట్ మూవీ ది వారియర్ నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ క్రమంలో బేబమ్మ విజయాల పరంపరకు తెరపడే అవకాశం కలదంటున్నారు.

దర్శకుడు లింగుస్వామి తెరక్కించిన బైలింగ్వల్ మూవీ  ది వారియర్ (The warriorr). హీరో రామ్ డాక్టర్, పోలీస్ గెటప్స్ లో అలరించారు. విలన్ రోల్ చేసిన ఆది పినిశెట్టికి ప్రశంసలు దక్కుతున్నాయి. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ది వారియర్ మూవీపై ప్రేక్షకులు పెదవి విరిచారు. పాత చింతకాయ పచ్చడి లాంటి కథకు లింగుస్వామి పసలేని కథనం విసుగు పుట్టించింది. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం రాసుకున్న కథను అప్పటి ఆలోచనలతో ఆయన తెరకెక్కించారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తెలుగులో ది వారియర్ కి ఆదరణ అంతంత మాత్రంగా ఉండగా తమిళంలో కనీస బజ్ లేదు. 

సాంగ్స్ కోసం హీరోయిన్, ఫైట్స్ కోసం విలన్ అన్నట్లు సాగిన ది వారియర్ మూవీని సోషల్ మీడియాలో ప్రేక్షకులు ఏకిపారేస్తున్నారు. కనీస కథాబలం లేని ఈ స్క్రిప్ట్ రామ్(Ram Pothineni) ఎలా ఓకె చేశారని వాపోతున్నారు. ఇక దేవిశ్రీ బీజీఎం కి అయితే పూర్తి నెగటివ్ మార్క్స్ పడ్డాయి. విలన్ ని ఎలివేట్ చేస్తూ హీరోని పడుకోబెట్టాడు, కొన్ని చోట్ల బీజీఎమ్ మిక్స్ సరిగా లేదని, సౌండ్ రావడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. మొత్తంగా ది వారియర్ ఏమాత్రం ఆసక్తి లేని రొటీన్ కమర్షియల్ చిత్రంగా ప్రేక్షకులు తేల్చేశారు. 

ఇక వరల్డ్ వైడ్ రూ. 40 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది వారియర్. రామ్ కెరీర్ లో భారీ హిట్ గా ఉన్న ఇస్మార్ట్ శంకర్ దాదాపు రూ. 35 కోట్ల షేర్ రాబట్టింది. అంటే కలెక్షన్స్ లో ఇస్మార్ట్ శంకర్ కంటే మరింత ఎక్కువగా ది వారియర్ అందుకోవాలి. ఈ టాక్ తో ది వారియర్ టార్గెట్ అందుకోవడం కష్టమే అని ట్రేడ్ పండితుల అంచనా. ఇక ఫస్ట్ డే ఏపీ/తెలంగాణ రాష్ట్రాల్లో ది వారియర్ రూ. 6.5 నుండి 7 కోట్ల షేర్ అందినట్లు కొన్ని సైట్స్ రిపోర్ట్ చేశాయి. 

టాక్ తో పోల్చితే ఈ కలెక్షన్స్ పర్వాలేదు. ఈ వీకెండ్ తో పాటు నెక్స్ట్ వీక్ సాలిడ్ వసూళ్లు రాబడితే మాత్రమే ది వారియర్ బయటపడగలదు. ప్రస్తుత ట్రెండ్ చూస్తే మాత్రం ది వారియర్ కి గడ్డుకాలమే అని చెప్పాలి. ఈ క్రమంలో హీరోయిన్ కృతి శెట్టి(Kruthi Shetty)కి ఈ మూవీ ఫస్ట్ ప్లాప్ కానుందా? అనే అనుమానాలు బయలుదేరాయి. ఉప్పెన మూవీతో హీరోయిన్ గా మారిన కృతి బ్లాక్ బస్టర్ ఆరంభం అందుకుంది. 

ఉప్పెన వంద కోట్లకు పైగా వసూళ్లతో నిర్మాతలకు భారీ లాభాలు పంచింది. అనంతరం కృతి నటించిన శ్యామ్ సింగరాయ్, నాగ చైతన్యకు జంటగా చేసిన బంగార్రాజు మూవీ హిట్ టాక్ సొంతం చేసుకుంది. హ్యాట్రిక్ విజయాలతో ఊపు మీదున్న బేబమ్మ జోరుకు ది వారియర్ అడ్డుకట్ట వేసినట్లయింది. 

PREV
click me!

Recommended Stories

Rithu Chowdary Eliminate: చివరి నిమిషంలో బిగ్‌ బాస్‌ షాకింగ్‌ ట్విస్ట్, రీతూ ఎలిమినేట్‌.. కారణం ఇదే
2025 Box office దగ్గర సునామీ సృష్టించిన చిన్న సినిమాలు, తక్కువ బడ్జెట్ ఎక్కువ కలెక్షన్స్