
అడివి శేష్ హీరోగా.. శశికరణ్ తిక్కా డైరెక్షన్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మాతగా తెరకెక్కిన సినిమా మేజర్. ముంభై దాడుల్లో అమర వీరుడైన సందీప్ ఉన్నీ కృష్ణన్ జీవిత కథ ఆధారంగా మేజర్ సినిమా తెరకెక్కింది. మేజర్ పాత్రలో నటించిన అడవి శేష్ జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. జూన్ 3న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన ఈసినిమా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
అడివి శేష్ సినిమా వస్తుందంటే ఆడియన్స్ లో ఓ ఆలోచన ఉంటుంది. అది మినిమం గ్యారెంటీ సినిమా అని ఫిక్స్ అవుతారు జనాలు. ఎందుకంటే ఫస్ట్ నుండి కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుని మరీ సినిమాలు చేస్తున్నాడు అడివి శేష్. ఈ సినిమాలతోనే ఆడియన్స్ లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు అడివిశేష్. థ్రిల్లర్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచాడు.ప్రస్తుతం వచ్చిన మేజర్ సినిమా కూడా అదే కోవలోకి వస్తుంది. ఇక అడివిశేష్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్ళు సాధించిన సినిమాగా మేజర్ నిలిచింది.
ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయిన ఈ సినిమా ఓటీటీలో కూడా దూసుకుపోతుంది. తాజాగా మేజర్ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో నాన్-ఇంగ్లీష్ సినిమాలలో దక్షిణాసియాలో మొదటి స్థానంలో.. వరల్డ్ వైడ్‌గా 8వ స్థానంలో నిలిచింది. నెట్‌ఫ్లిక్స్ రిలీజ్ చేసిన ట్రెండింగ్ టాప్ 10లో మేజర్ సినిమా 14 దేశాల్లో టాప్ 10లో ఉంది. ఇలా ఓటీటీలో కూడా మేజర్ విజయ విహారం చేస్తోంది.
ఇక మేజర్ సందీప్ పాత్రలో అడివిశేష్ నటనకు వందకు వంద మార్కులు పడ్డాయి. బయోగ్రాఫీకల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాను జీఎంబీ ఎంటర్టైనమెంట్స్ మహేష్ బాబు.. సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా, ఏ+ఎయస్ మూవీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. అడివిశేష్‌కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాతోనే సాయి టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఇక ప్రకాష్ రాజ్, రేవతి, శోభితా ధూళిపాల లాంటి నటులు మేజర్ సినిమాలో కీలక పాత్రల్లో నటించి మెప్పించారు.