అమితాబ్ చేత కంటనీరు పెట్టించిన సూర్య!

Published : Sep 04, 2021, 10:36 AM ISTUpdated : Sep 04, 2021, 10:38 AM IST
అమితాబ్ చేత కంటనీరు పెట్టించిన సూర్య!

సారాంశం

కోలీవుడ్ సూపర్ స్టార్స్ లో ఒకరిగా ఉన్న సూర్యకు తెలుగులో కూడా సమానమైన క్రేజ్ ఉంది. అలాంటి సూర్య సినిమా గురించి బిగ్ బి అమితాబ్ మాట్లాడడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

హీరో సూర్య అద్భుతమైన నటుడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. కోలీవుడ్ సూపర్ స్టార్స్ లో ఒకరిగా ఉన్న సూర్యకు తెలుగులో కూడా సమానమైన క్రేజ్ ఉంది. అలాంటి సూర్య సినిమా గురించి బిగ్ బి అమితాబ్ మాట్లాడడం ప్రాధాన్యత సంతరించుకుంది. సూర్య లాస్ట్ రిలీజ్ సురారై పోట్రు.. తెలుగులో ఆకాశం నీ హద్దురా టైటిల్ తో విడుదలైంది. అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. 

డెక్కన్ ఎయిర్ వేస్ ఫౌండర్ జీఆర్ గోపీనాధ్ జీవిత కథ ఆధారంగా సురారై పోట్రు తెరకెక్కింది. కాగా ఈ చిత్రంలోని  'కయ్యిలే ఆగాశమ్‌.. కొండు వంద ఉన్‌ పాసమ్‌' తెలుగులో 'అందని ఆకాశం దించవయ్యా మాకోసం' పాట అమితాబ్ చేత కన్నీరు పెట్టించిందట. ఈ పాట చూస్తున్నంత సేపు భావోద్వేగం ఆపుకోవడం నా వల్ల కాలేదంటూ అమితాబ్ తన బ్లాగ్ లో రాసుకొచ్చారు. 

కొన్నిసార్లు మన ఊహకు అందని సంఘటనలు జరుగుతాయి. గత రాత్రి అలాంటిది జరిగింది. నేను భావోద్వేగానికి గురయ్యాను. ఆ ఎమోషన్స్ ఆపుకోవడం నా వల్లకాలేదు. ఆ వీడియో చూసిన ప్రతిసారి నా కళ్ళు మూతలు పడుతున్నాయి. 

సూర్య చిత్రంలోని తమిళ్ సాంగ్ చూస్తుంటే మనసు బద్దలవుతుంది. గత రాత్రి మరింతగా నేను భావోద్వేగానికి గురయ్యాను. ధారగా కారుతున్న కన్నీళ్లు ఆపుకోవడం నాకు సాధ్యం కాలేదు. ఆ పాట తండ్రి కొడుకుల మధ్య సాగే భావోద్వేగానికి సంబంధించి, ఆ వీడియో ఇదే... అంటూ అమితాబ్ బ్లాగ్ లో రాసుకొచ్చారు. 

తమ చిత్రంలోని ఓ పాట తనను అంతలా కదిలించిందంటూ అమితాబ్ లాంటి లెజెండ్ స్పందించడంతో చిత్ర యూనిట్ సోషల్ మీడియా వేదికగా ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. సూరారై పోట్రు చిత్రానికి లేడీ డైరెక్టర్ సుధా కొంగర దర్శకత్వం వహించారు. 

PREV
click me!

Recommended Stories

Thalapathy Vijay సినిమా స్టోరీ లీక్, జన నాయగన్ కథ ఇదేనా? షాక్ లో మూవీ టీమ్
Pawan Kalyan కోసం రామ్ చరణ్ త్యాగం? పెద్ది రిలీజ్ పై మెగా అభిమానుల్లో ఆందోళన