
బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్స్ లో యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్ ఒకరు. అధికారిక ప్రకటన లేకున్నా షణ్ముఖ్ హౌస్లోకి వెళుతున్నాడనేది వంద శాతం నిజం. ఈ విషయాన్ని ధృవీకరించేలా ఆయన లేటెస్ట్ సోషల్ మీడియా పోస్ట్ ఉంది. షణ్ముఖ్ ఎమోషనల్ ఇంస్టాగ్రామ్ పోస్ట్... ఆయన బిగ్ బాస్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చింది.
బిగ్ బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్స్ క్వారంటైన్ ముగిసినట్లు సమాచారం. ఇక ఎంపికైన కంటెస్టెంట్స్ వద్ద నుండి మొబైల్స్ కూడా నిర్వాహకులు స్వాధీనం చేసుకున్నారట. అందరికీ కరోనా పరీక్షలతో, పాటు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారట. బిగ్ బాస్ హౌస్ లోకి వెళితే బయట ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి. హౌస్ మేట్స్ మినహా బయటివారిని కలిసే, మాట్లాడే అవకాశం ఉండదు. టీవీ కూడా లేని హౌస్ లో బయట పరిస్థితుల గురించి ఎటువంటి అవగాహన ఉండదు.
ఈ నేపథ్యంలో షణ్ముఖ్ తన ఇంస్టాగ్రామ్ లో చివరి పోస్ట్ చేశారు. ఆయన షార్ట్ గా 'IWMYA' అంటూ కామెంట్ చేశాడు. దీన్ని పూర్తిగా విశదీకరిస్తే 'l WILL MISS YOU ALL' అని అర్థం అవుతుంది. హౌస్ లోకి వెళితే ఫ్రెండ్స్, ఫ్యాన్స్, ఫ్యామిలీ మెంబర్స్ తో సంబంధాలు తెగిపోతాయి. అందుకే షణ్ముఖ్ ఇలా తన ఫీలింగ్ కామెంట్ రూపంలో తెలిపారు. ఇక షణ్ముఖ్ హీరోగా యూట్యూబ్ లో విడుదలైన సాఫ్ట్ వేర్ డెవలపర్ సిరీస్ బాగా పాప్యులర్ అయ్యింది.