అందగాడితో ప్రియమణి, నయనతార రొమాన్స్ షురూ!

pratap reddy   | Asianet News
Published : Sep 04, 2021, 09:34 AM ISTUpdated : Sep 04, 2021, 09:43 AM IST
అందగాడితో ప్రియమణి, నయనతార రొమాన్స్ షురూ!

సారాంశం

నయనతార, ప్రియమణి ఇద్దరూ సౌత్ లో ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న నటీమణులు. రోజు రోజుకు నయనతార తన క్రేజ్ పెంచుకుంటూ లేడి సూపర్ స్టార్ గా సౌత్ ని ఏలుతోంది. 

నయనతార, ప్రియమణి ఇద్దరూ సౌత్ లో ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న నటీమణులు. రోజు రోజుకు నయనతార తన క్రేజ్ పెంచుకుంటూ లేడి సూపర్ స్టార్ గా సౌత్ ని ఏలుతోంది. ఇక ప్రియమణి వివాహం తర్వాత కూడా మంచి అవకాశాలతో రాణిస్తోంది. 

ఈ క్రేజీ హీరోయిన్లు ఇద్దరూ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. అది కూడా మోస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ లో. యంగ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో అందగాడు, బాలీవుడ్ బాద్షా షారుఖ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్ళింది. ఈ చిత్రంలో నయనతార, ప్రియమణి హీరోయిన్లుగా నటిస్తున్నారు. 

తాజాగా మొదలైన షూటింగ్ లో నయనతార, ప్రియమణి జాయిన్ అయ్యారు. పూణేలో ఈ చిత్ర షూటింగ్ జరుగుతోంది. పూణే ఎయిర్ పోర్ట్ లో ప్రియమణి, నయనతార వెళుతున్న పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

ప్రియమణి గతంలో షారుఖ్ నటించిన చెన్నై ఎక్స్ ప్రెస్ చిత్రంలో స్పెషల్ సాంగ్ చేసింది. నయనతారకు మాత్రం బాలీవుడ్ లో ఇదే ఫస్ట్ మూవీ. కథా బలంతో ఎమోషన్స్ న హైలైట్ చేస్తూ సినిమాని ప్రజెంట్ చేసే దర్శకుడిగా అట్లీ గుర్తింపు పొందాడు. దీనితో షారుఖ్ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ మూవీలో షారుఖ్ డ్యూయెల్ రోల్ లో నటిస్తాడని వినికిడి. 

PREV
click me!

Recommended Stories

Chiranjeevi, Mahesh Babu సినిమాలతో పోటీ పడి టాప్ 5లో నిలిచిన హీరో, టాలీవుడ్ రాజకీయాలపై ఓపెన్ కామెంట్స్
Thalapathy Vijay సినిమా స్టోరీ లీక్, జన నాయగన్ కథ ఇదేనా? షాక్ లో మూవీ టీమ్