ఆదిపురుష్ రామాయణంలా లేదు, గ్లాడియేటర్ లాగా ఉంది.. అందుకే నచ్చలేదు, హీరో సుమన్ కామెంట్స్

Published : Jun 21, 2023, 05:03 PM IST
ఆదిపురుష్ రామాయణంలా లేదు, గ్లాడియేటర్ లాగా ఉంది.. అందుకే నచ్చలేదు, హీరో సుమన్ కామెంట్స్

సారాంశం

ప్రభాస్ శ్రీరాముడిగా నటించిన ఆదిపురుష్ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా జూన్ 16న రిలీజయింది. ముందు నుంచి వస్తున్న విమర్శలకు తగ్గట్లుగానే ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ మొదలైంది. 

ప్రభాస్ శ్రీరాముడిగా నటించిన ఆదిపురుష్ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా జూన్ 16న రిలీజయింది. ముందు నుంచి వస్తున్న విమర్శలకు తగ్గట్లుగానే ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ మొదలైంది. అయినప్పటికీ ప్రభాస్ క్రేజ్ తో వీకెండ్ లో వసూళ్ల వరద పారింది. కానీ వీక్ డేస్ మొదలయ్యే సరికి ఈ చిత్ర జోరు తగ్గిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

ఇక ఆదిపురుష్ చిత్రం దేశం మొత్తం వివాదాలతో నలిగిపోతోంది. హిందూ సంఘాలు ఎక్కడికక్కడ ఈ చిత్రంపై వ్యతిరేకత తెలియజేస్తున్నాయి. కొన్ని చోట్ల అయితే ఆదిపురుష్ చిత్రాన్ని బ్యాన్ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. 

తాజాగా ఆదిపురుష్ చిత్రంపై హీరో సుమన్ స్పందించారు. ఆదిపురుష్ చిత్రం ఆడియన్స్ కి అంతగా నచ్చకపోవడానికి కారణం భావోద్వేగాలు పండలేదని సుమన్ అన్నారు. మనకు తెలిసిన రాముడు కృష్ణుడు అంటే నీలంగా కనిపిస్తారు. గడ్డాలు మీసాలు ఉండవు. కానీ ఓం రౌత్ అందుకు భిన్నంగా చూపించే ప్రయత్నం చేశారు. అది పెద్ద రిస్క్ అని సుమన్ అన్నారు. 

ఇక్కడ ప్రభాస్ తప్పేమి లేదు. డైరెక్టర్ చెప్పినట్లు ప్రభాస్ చేశాడు. రెండేళ్ల పాటు ఈ పాత్ర కోసం ప్రభాస్ కష్టపడ్డాడు. అందుకు ప్రభాస్ కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఈ చిత్రంలో రాముడికి, లక్ష్మణుడికి, హనుమంతుడికి, రావణుడి పాత్రకి ఎంచుకున్న కాస్ట్యూమ్స్ సరిగ్గా లేవు. హాలీవుడ్ తరహాలో గ్లాడియేటర్ లుక్ తీసుకువచ్చారు. అది కూడా పెద్ద తప్పే. 

అందరికి తెలిసిన రామాయణాన్ని తీసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. భిన్నంగా ప్రయత్నిచాలనుకోవడం కూడా పెద్ద రిస్క్ అని సుమన్ అన్నారు. ఆదిపురుష్ చిత్రం లో దర్శకుడు చేసిన ప్రయోగాలేవి ఆడియన్స్ కి నచ్చలేదు. రామాయణం, మహాభారతం గురించి తీయాలంటే దక్షణాది వారికీ మాత్రమే సాధ్యం. ఎందుకంటే ఇతిహాసాలని సౌత్ వాళ్ళు బాగా అర్థం చేసుకున్నారు. 

నాకు తెలిసి రాజమౌళి అయితే రామాయణానికి బాగా న్యాయం చేస్తారనిపిస్తోంది. ఆయన కనుక రామాయణం తెరకెక్కిస్తే అంతర్జాతీయ స్థాయికి వెళుతుంది అని సుమన్ తెలిపారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Missterious Review: 'మిస్‌టీరియస్' మూవీ రివ్యూ.. ట్రైయాంగిల్ లవ్ స్టోరీలో మిస్టరీ ఆకట్టుకుందా, తేలిపోయిందా ?
అఖండ-2లో బాలయ్య కూతురిగా ఫస్ట్ ఛాయస్ స్టార్ హీరో కూతురట.. ఆమె ఎవరో తెలుసా.?