వెంకటేశ్వర స్వామిపై నాకు భక్తి ఉండేది కాదు..అయినా కరుణించారు, హీరో సుమన్ కామెంట్స్

Published : Jun 16, 2023, 07:28 AM IST
వెంకటేశ్వర స్వామిపై నాకు భక్తి ఉండేది కాదు..అయినా కరుణించారు, హీరో సుమన్ కామెంట్స్

సారాంశం

శివాజీ చిత్రంలో విలన్ పాత్ర, అన్నమయ్య చిత్రంలో వెంకటేశ్వర స్వామి పాత్ర సుమన్ కి సరికొత్త ఇమేజ్ తీసుకువచ్చాయి. 

80, 90 దశకాల్లో హీరోగా రాణించిన సుమన్.. ప్రస్తుతం క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నారు. సుమన్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. శివాజీ చిత్రంలో విలన్ పాత్ర, అన్నమయ్య చిత్రంలో వెంకటేశ్వర స్వామి పాత్ర సుమన్ కి సరికొత్త ఇమేజ్ తీసుకువచ్చాయి. 

అయితే భలే విచిత్రంగా ఒకప్పుడు సుమన్ కి వెంకటేశ్వర స్వామి అంటే భక్తి ఉండేది కాదట. వెంకటేశ్వర స్వామిని అసలు కేర్ చేసేవాడిని కాదని సుమన్ ఆసక్తికర వ్యాఖలు చేశారు. గురువారం రోజు హీరో సుమన్ తన స్నేహితులతో కలసి తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. 

దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడుతూ సుమన్ ఈ కామెంట్స్ చేశారు. నాకు ఒకప్పుడు స్వామివారిపై భక్తి ఉండేది కాదు. అయినా కూడా స్వామివారు నన్ను కరుణించారు. ఆయన పాత్రలో అన్నమయ్యలో నటించే అవకాశం కల్పించారు. అప్పుడే తెలిసింది. స్వామివారి చల్లని చూపు నాపై ఉందని సుమన్ అన్నారు. 

తిరుపతిలో ఐఏఎస్ అధికారి రామారావు కుమారుడి వివాహం జరిగింది. ఆ పెళ్ళికి హాజరైన సుమన్.. తనకు కావాల్సిన తన అభిమాని పుట్టినరోజు సందర్భంగా తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు సుమన్ కి తీర్థ ప్రసాదాలు అందించారు. 

అలాగే పాలిటిక్స్ గురించి కూడా సుమన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర స్థాయి రాజకీయాల్లో ఉండాలా లేక కేంద్ర రాజకీయాల్లో ఉండాలా అనేది నిర్ణయించుకోలేదు అని సుమన్ అన్నారు. అయితే సీఎం కేసీఆర్ అంటే తనకు ప్రత్యేక అభిమానం అని మాత్రం చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

Gunde Ninda Gudi Gantalu Today ఎపిసోడ్ డిసెంబర్ 16 బాలుని సవతి తల్లిలా చూశాను... ప్రభావతిలో మొదలైన పశ్ఛాత్తాపం
Regina Cassandra: ముస్లింగా పుట్టి క్రిస్టియన్ పేరు ఎందుకు పెట్టుకుందో చెప్పేసిన రెజీనా