రిలీజ్ కి ముందు ఆదిపురుష్ పై ఈ ఏడుపేంటి.. సుతిమెత్తగా ఉతికారేసిన హరీష్ శంకర్

Published : Jun 16, 2023, 06:00 AM IST
రిలీజ్ కి ముందు ఆదిపురుష్ పై ఈ ఏడుపేంటి.. సుతిమెత్తగా ఉతికారేసిన హరీష్ శంకర్

సారాంశం

ఆదిపురుష్ చిత్రానికి ముందు నుంచి వివాదాలు, కాస్త నెగిటివిటీ ఎక్కువవుతున్నాయి. దర్శకుడు ఓం రౌత్ ఈ జనరేషన్ ఆడియన్స్ కోసం ఎక్కువగా విజువల్ ఎఫెక్ట్స్ ఉపయోగించారు. 

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన చారిత్రాత్మక చిత్రం ఆదిపురుష్. భారతీయులు ఎంతో భక్తి శ్రద్దలతో ఆరాధించే పుణ్యపురుషుడు శ్రీరాముడి పాత్రలో ప్రభాస్ నటించిన చిత్రం ఇది. రామాయణం పురాణం ఆధారంగా దర్శకుడు ఓం రౌత్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఎన్నో వివాదాల మధ్య నలుగుతూ.. అదే విధంగా భారీ అంచనాలతో ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శ్రీరాముడిగా ప్రభాస్ నటించగా .. జానకి పాత్రలో కృతి సనన్.. రావణాసురుడిగా సైఫ్ అలీఖాన్ నటించారు. 

ఆదిపురుష్ చిత్రానికి ముందు నుంచి వివాదాలు, కాస్త నెగిటివిటీ ఎక్కువవుతున్నాయి. దర్శకుడు ఓం రౌత్ ఈ జనరేషన్ ఆడియన్స్ కోసం ఎక్కువగా విజువల్ ఎఫెక్ట్స్ ఉపయోగించారు. ఫలితంగా సినిమాటిక్ లిబర్టీ తీసుకోవడంతో రామాయణం కథ ఎఫెక్ట్ అవుతుందే వాదన ఉంది. అయితే ఆడియన్స్ ని కన్విన్స్ చేయడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడా లేదా అనేది మూవీ రిలీజ్ అయ్యాక తెలుస్తుంది. 

గతంలో వచ్చిన రామాయణ చిత్రాలు, టివి సీరియల్స్ తో పదే పదే కొందరు హిందూ వాదులు పోలిక పెడుతూ విమర్శలు చేస్తున్నారు. సినిమా రిలీజ్ అవుతున్న తరుణంలో కూడా ఈ పోలికలు సోషల్ మీడియాలో ఎక్కువయ్యాయి. ఓ సోషల్ మీడియా ట్విట్టర్ హ్యాండిల్ చేసిన ఓ పోస్ట్ పై హరీష్ శంకర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ సుతిమెత్తగా కౌంటర్ ఇచ్చారు. 

రామానంద్ సాగర్ తెరకెక్కించిన 'రామాయణం' సిరీస్ ఎంత అద్భుతమైన ప్రాచుర్యం పొందిందో తెలిసిందే. 90వ దశకంలో టెలికాస్ట్ అయిన ఈ సిరీస్ ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతుంది. సదరు సోషల్ మీడియా హ్యాండిల్ ఆ టీవీ సిరీస్ దృశ్యాలని పోస్ట్ చేస్తూ.. దీనికి ఇంకేదీ సాటి రాదు అని కామెంట్ పెట్టారు. పరోక్షంగా ఆదిపురుష్ ని టార్గెట్ చేసేలా ఈ పోస్ట్ ఉందని అర్థం చేసుకోవచ్చు. 

ఇది గమనించిన స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ సుతిమెత్తగా కౌంటర్ ఇచ్చారు. రామాయణ్ సిరీస్ విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానం లేదు. కానీ ఒక సెక్యూర్డ్ హ్యాండిల్ నుంచి ఆదిపురుష్ రిలీజ్ కి ముందు ఇలాంటి పోస్ట్ చూడడం చాలా బాధాకరం. ఐక్యత కూడా సనాతన ధర్మంలో భాగమే అని హరీష్ శంకర్ తనదైన శైలిలో  కౌంటర్ ఇచ్చారు. హరీష్ కౌంటర్ ప్రస్తుతం వైరల్ గా మారింది. 

ఇదిలా ఉండగా ఆదిపురుష్ ప్రీమియర్ షోల నుంచి చిత్రానికి, రాముడిగా ప్రభాస్ పాత్రకి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ఇండియా వ్యాప్తంగా హోరెత్తుతున్న సంగతి తెలిసిందే. ట్రేడ్ విశ్లేషకుల ఊహకి కూడా అందని విధంగా ఆదిపురుష్ డే వన్ ఓపెనింగ్స్ ఉండబోతునట్లు తెలుస్తోంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

'అనగనగా ఒక రాజు' మూవీ ఫస్ట్ రివ్యూ.. ఈ సంక్రాంతికి అసలైన విన్నర్, నవీన్ పోలిశెట్టి ఖాతాలో మరో సూపర్ హిట్ ?
రాజవంశానికి చెందిన హీరోయిన్, మాజీ ప్రధాని మనవరాలు, స్టార్ హీరోను రెండో పెళ్లి చేసుకున్న నటి ఎవరో తెలుసా?