నాగ్‌ నోట `జై శ్రీరామ్‌` మాట.. `ఆదిపురుష్‌`కి అమీర్‌ విషెస్‌.. వరుణ్‌ తేజ్‌ వెయిట్‌ చేయలేకపోతున్నా అంటూ..

Published : Jun 15, 2023, 09:22 PM ISTUpdated : Jun 15, 2023, 09:24 PM IST
నాగ్‌ నోట `జై శ్రీరామ్‌` మాట.. `ఆదిపురుష్‌`కి అమీర్‌  విషెస్‌.. వరుణ్‌ తేజ్‌ వెయిట్‌ చేయలేకపోతున్నా అంటూ..

సారాంశం

నాగార్జున.. ప్రభాస్‌కి బెస్ట్ విషెస్‌ చెప్పాడు. జై శ్రీరామ్‌ అన్నాడు, మరోవైపు అమీర్‌ ఖాన్‌ సైతం రియాక్ట్ అయ్యారు. అలాగే వరుణ్‌ తేజ్‌ ఆగలేకపోతున్నా అంటూ పోస్ట్ పెట్టారు.  ఆదిపురుష్‌ కోసం వీరంతా విషెస్‌ తెలిపారు.

`ఆదిపురుష్‌` నెగటివ్‌ కామెంట్ల నుంచి నెమ్మదిగా పాజిటివ్‌గా టర్న్ తీసుకుని ఇప్పుడు ఇదొక ప్రభంజనంలా మారిపోయింది. ఇండియన్‌ సినిమా మొత్తం ఇప్పుడు `ఆదిపురుష్‌` పేరుని స్మరిస్తుంది. జై శ్రీరామ్‌ అని అంతా స్మరించినట్టుగానే `ఆదిపురుష్‌` పేరుని స్మరిస్తున్నారు. ప్రభాస్‌.. రాముడిగా చేయడం అందరిలోనూ ఆసక్తి నెలకొంది. దీనికితోడు గతంలో రామాయణం, రాముడు, సీతల పాత్రలకు భిన్నంగా ఈ `ఆదిపురుష్‌`లోని పాత్రలు ఉండటంతో అందరూ ఆశ్చర్యంగా, ఆసక్తికరంగా ఈ సినిమా కోసం వెయిట్‌ చేస్తున్నారు. సెలబ్రిటీలు సైతం ఈ సినిమా కోసం వెయిట్‌ చేస్తుండటం విశేషం. 

అంతేకాదు సినిమా తారలు ఈ చిత్రానికి బెస్ట్ విషెస్‌ తెలియజేస్తున్నారు. తాజాగా నాగార్జున బెస్ట్ విషెస్‌ తెలిపారు. ఆయన గురువారం `1920` అనే సినిమా ఈవెంట్‌లో పాల్గొన్నారు. అవికా గోర్‌ నటించిన చిత్రమిది. మహేష్‌ భట్‌ సమర్పకులు. ఈ కార్యక్రమంలో గెస్ట్ గా నాగార్జున పాల్గొన్నారు. టీమ్‌కి తన బెస్ట్ విషెస్‌ అందజేశారు. అనంతరం `ఆదిపురుష్‌`కి ఆయన తన అభినందనలు తెలిపారు. రేపు అతి పెద్ద సినిమా `ఆదిపురుష్‌` రిలీజ్‌ అవుతుందని, ప్రభాస్‌ టీమ్‌కి నా బెస్ట్ విషెస్‌, సినిమా బాగా ఆడాలి, ఆడియెన్స్ ని తిరిగి థియేటర్‌కి తీసుకు రావాలన్నారు నాగ్‌. అనంతరం ఆయన నోటి నుంచి `జై శ్రీరామ్‌` నామం పలకడం విశేషం. 

మరోవైపు బాలీవుడ్‌ మిస్టర్‌ పర్‌ఫెక్ట్ అమీర్‌ ఖాన్‌ సైతం తన విషెస్‌ని తెలిపారు. `ప్రభాస్‌, భూషణ్‌ కుమార్‌, ఓం రౌత్‌, సైఫ్‌ అలీ ఖాన్‌, కృతి సనన్‌ టీమ్‌ అందరు కలిసి చేసిన పురాణ చిత్రం `ఆదిపురుష్‌`కి ఆల్‌ ది బెస్ట్. ఇది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల హృదయాలను గెలుచుకోవాలి` అని తెలిపారు. మరోవైపు ఇటీవల లావణ్య త్రిపాఠితో ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న వరుణ్‌ తేజ్‌ సైతం తన అభినందనలు తెలిపారు. `పెద్ద తెరపై ఈ అద్భుతాన్ని చూడటానికి వెయిట్‌ చేయలేకపోతున్నా. ప్రభాస్‌ అన్నకి, `ఆదిపురుష్‌` టీమ్‌కి నా బెస్ట్ విషెస్‌ అని తెలిపారు వరుణ్ తేజ్‌.

`ఆదిపురుష్‌` ప్రీ సేల్స్ లో సంచలనం సృష్టిస్తుంది. ఇది ఇప్పటికే ముప్పైకోట్లకుపైగా ప్రీ సేల్స్  ద్వారా కలెక్ట్ చేసింది. ఇంకా ఇండియా మొత్తంలో ఫాస్ట్ గా టికెట్స్ బుక్‌ అవుతున్నాయి. కనీ వినీ ఎరుగని రీతిలో `ఆదిపురుష్‌` కోసం ఆడియెన్స్ ఎగబడుతున్నారు. ఈ సినిమాకి హైదరాబాద్‌ పరిధిలో అత్యధికంగా 1012 షోస్‌ ఫుల్‌ అయ్యాయి. బెంగుళూరులో 370 షోస్‌, ఢిల్లీలో 360 షోస్‌, ముంబయిలో 170 షోస్‌, పుణేలో 150, చెన్నైలో 100, అహ్మదాబాద్‌లో 50 షోస్‌, చండిగర్‌ 30 షోస్‌, కోల్‌కతాలో 40 షోస్‌,కోచిలో ఐదు షోస్‌ ఫుల్‌ అయిపోయాయి. 

చాలా రోజుల తర్వాత ఒక భారీ సినిమా రావడంతో ఆడియెన్స్ కదులుతున్నారు. ఫ్యామిలీ ఆడియెన్స్ నుంచి, యూత్‌ వరకు ఈ సినిమా కోసం వెయిట్‌ చేస్తుండటం విశేషం. రామాయణం ఆధారంగా వస్తోన్న నేపథ్యంలో ఇండియాలో హిందూ సెంటిమెంట్‌ ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో, పైగా ప్రభాస్‌ లాంటి గ్లోబల్‌ స్టార్‌ నటిస్తుండటంతో ఈ చిత్రానికి భారీ క్రేజ్‌ నెలకొంది. మరి ఈ అంచనాలు సినిమా ఎంత వరకు రీచ్‌ అవుతుందనేది చూడాలి. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: తనూజకి షాక్‌.. కళ్యాణ్‌ సీక్రెట్‌ క్రష్‌ బయటపెట్టిన ఇమ్మాన్యుయెల్‌
Dhurandhar Collections: బాక్సాఫీసు వద్ద `ధురంధర్‌` కలెక్షన్ల సునామీ.. తెలుగు ఆడియెన్స్ కి గుడ్‌ న్యూస్‌