Sree Vishnu : ప్రభాస్ ఎంట్రీ... విజిల్స్ తో థియేటర్ లో రచ్చరచ్చ చేసిన హీరో శ్రీవిష్ణు.. వీడియో

Published : Dec 22, 2023, 12:48 PM IST
Sree Vishnu : ప్రభాస్ ఎంట్రీ... విజిల్స్ తో థియేటర్ లో రచ్చరచ్చ చేసిన హీరో శ్రీవిష్ణు.. వీడియో

సారాంశం

ప్రభాస్ సినిమా రిలీజ్ అంటే.. అభిమానులు, ఆడియెన్సే కాదు... హీరోలు కూడా ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తుంటారు. ‘సలార్’ విడుదల సందర్భంగా యంగ్ హీరో శ్రీవిష్ణు థియేటర్ లో సందడి చేశారు.   

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) అభిమానులు కొన్నేళ్లుగా ఎదురుచూస్తున్న సాలిడ్ యాక్షన్ ఫిల్మ్ థియేటర్లలో దిగింది. సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel)  రెబల్ స్టార్ కాంబోలో ‘సలార్’ (Salaar Cease Fire)  ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ రోజే ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. అయితే ప్రభాస్ సినిమా రిలీజ్ అంటే.. అభిమానులు, ఆడియెన్సే కాదు... హీరోలు కూడా ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తుంటారు. ఇక ‘సలార్’ విడుదల సందర్భంగా యంగ్ హీరో శ్రీవిష్ణు (Sree Vishnu) థియేటర్ లో సందడి చేశారు. 

బాహుబలి తర్వాత మళ్లీ ప్రభాస్ ను ఆ రేంజ్ లో వెండితెరపై అభిమానులు వీక్షిస్తున్నారు. ప్రశాంత్ నీల్ డార్లింగ్ ను చూపించిన తీరుకు ఫిదా అవుతున్నారు. ఇక యంగ్ హీరో శ్రీవిష్ణు కూడా ఫస్ట్ డే ఫస్ట్ షోకు వెళ్లి ఆడియెన్స్ తో కలిసి సినిమా చూశారు. ఈ సందర్భంగా మూవీలో ప్రభాస్ ఎంట్రీ రాగానే విజిల్స్ వేస్తూ రచ్చరచ్చ చేశారు. తమ అభిమాన హీరోను వెండితెరపై అలా చూసే సరికి సీట్ లో కూర్చోలేకపోయారు శ్రీవిష్ణు. ఎంతో హుషారుగా కేకలు వేస్తూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. 

అందుకు సంబంధించిన వీడియో కూడా నెట్టింట వైరల్ గా మారింది.  శ్రీవిష్ణు సలార్ చిత్రాన్నిఎంతలా ఎంజాయ్ చేశారో అర్థమవుతుంది. ఇక అభిమానుల ఆనందానికి కూడా హద్దులు లేవు. ఫుల్ యాక్షన్ మోడ్ లో డార్లింగ్ ను చూడాలని ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న అభిమానులకు ‘సలార్’ రూపంలో యాక్షన్ ఫీస్ట్ కలిగింది. టాక్ కూడా అదిరిపోయింది. దీంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం ఓ రేంజ్ లో ఉంటుందని అర్థమవుతోంది. 

ఈ క్రమంలో మొదటి రోజు సలార్ కలెక్షన్స్ ఎలా ఉంటాయనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఈ చిత్రాన్నిప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించగా.. ‘కేజీఎఫ్’ నిర్మాణ సంస్థ ‘హోంబలే ఫిల్మ్స్’ బ్యానర్ పై గ్రాండ్ గా నిర్మించారు. స్టార్ హీరోయిన్ శృతిహాసన్ కథనాయిక. పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు, ఈశ్వరీరావు, టిన్ను ఆనంద్, సప్తగిరి తదితరులు ఈ చిత్రంలో నటించారు. 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Sanjana Remuneration : విన్నర్ రేంజ్ లో పారితోషికం అందుకున్న సంజన గల్రానీ, 15 వారాలు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నందుకు ఎంత ఇచ్చారంటే?
Bigg Boss Telugu 9 : తనూజ తో ఐటమ్ సాంగ్ చేయిస్తానన్న ఇమ్మాన్యుయేల్, అడ్డంగా బుక్కైన డీమాన్ పవన్.. హౌస్ లో చివరి రోజు సందడి