`మానాడు` ఈవెంట్‌లో కన్నీళ్లు పెట్టుకోవడంపై శింబు వివరణ.. ఆ స్ట్రగుల్స్ అన్ని గుర్తొచ్చాయట..

By Aithagoni RajuFirst Published Nov 22, 2021, 4:47 PM IST
Highlights

ఇటీవల `మానాడు` చెన్నై ఈవెంట్‌లో శింబు కన్నీళ్లు పెట్టుకున్నారు. దీనిపై తాజాగా ఆయన వివరణ ఇచ్చారు. తన సినిమా జర్నీలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నానని, అయినా ఎప్పుడూ అధైర్య పడలేదని, వెనకడుగు వేయలేదని తెలిపారు. 

`మన్మథ`గా తెలుగు ఆడియెన్స్ కి దగ్గరయ్యాడు శింబు(Simbu). ఆ తర్వాత ఆయన ఆ స్థాయి సినిమాలతో తెలుగులోకి రాలేదు. తెలుగులో `మన్మథ` చిత్రం మంచి మార్కెట్‌ ఏర్పడినా దాన్ని సరైన విధానంగా, తెలుగు మార్కెట్‌ పెంచుకునే ప్రయత్నం చేయలేకపోయాడు Simbu. చాలా రోజుల తర్వాత మళ్లీ ఆయన `మానాడు` చిత్రంతో రాబోతున్నారు. తెలుగులో `ది లూప్‌`(The Loop) పేరుతో ఈ చిత్రాన్ని ఈ నెల 25న విడుదల చేస్తున్నారు. అందులో భాగంగా ఆయన తెలుగు మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు. ఇటీవల `మానాడు` చెన్నై ఈవెంట్‌లో శింబు కన్నీళ్లు పెట్టుకున్నారు. దీనిపై తాజాగా ఆయన వివరణ ఇచ్చారు. 

తన సినిమా జర్నీలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నానని, అయినా ఎప్పుడూ అధైర్య పడలేదని, వెనకడుగు వేయలేదని తెలిపారు. కష్టాలన్నింటిని చిరునవ్వుతో స్వీకరిస్తూ వచ్చానని, `మానాడు` సినిమాని ఆడియో ముందుకు తీసుకు రావడం కోసం చాలా కష్టపడాల్సి వచ్చిందని, దాదాపు మూడేళ్లపాటు స్ట్రగుల్‌ అయినట్టు చెప్పాడు శింబు. ఈ మూడేళ్లలో ఎన్నో అడ్డంకులు ఎదుర్కొన్నారట. సినిమా రాజకీయ నేపథ్యంతో ఉండటంతో కొన్ని రాజకీయ పరమైన ఒత్తిళ్లు ఎదురైనట్టు చెప్పారు. దీనికితోడు నిర్మాణ పరమైన కారణాలతో ఒకానొక దశలో సినిమా ఆగిపోయిందన్నారు. 

కెరీర్‌ స్ట్రగుల్స్ లో ఉండటం, పైగా ఇలాంటి అడ్డంకులన్నీ ఎదురు కావడం, అవన్నీ `మానాడు` ఈవెంట్‌లో గుర్తు రావడంతో కన్నీళ్లు ఆపుకోలేకపోయానని, చాలా ఎమోషనల్‌ అయ్యానని తెలిపారు శింబు. అయితే తాను స్ట్రగుల్స్ లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు అభిమానులే అండగా నిలిచారని తెలిపారు. దీంతో తనకు ఇండస్ట్రీ నుంచి ఎలాంటి సపోర్ట్ లేదనే విషయాన్ని ఆయన పరోక్షంగా వెల్లడించారు. తాను ఒక్కడే ఒంటరిగా అన్నింటిని ఫేస్‌ చేసినట్టు చెప్పారు శింబు. 

బరువు తగ్గడం గురించి చెబుతూ,  కరోనా సమయంలో ఆయన ఏకంగా 27కిలోలు బరువు తగ్గాడట. ఈ సినిమాకి ముందు తన కెరీర్‌ బ్యాడ్‌ ఫేజ్‌లో ఉందని, ఆ క్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడేందుకు మానసికంగా, ఆధ్యాత్మికంగా తన ఆలోచణ ధోరణిలో మార్పులు చేసుకోవాలని నిర్ణయించుకున్నాడట. కరోనాతో షూటింగ్‌లన్నీ నిలిచిపోవడంతో బరువు తగ్గడంపై ఫోకస్‌ పెట్టానని, ప్రతి రోజులు ఉదయం నాలుగు గంటల లేచి వర్కౌట్స్ చేయడం మొదలు పెట్టానని, దాదాపు ఇరవై ఏడు కిలోల తగ్గా, ఆల్కహాల్‌ తాగడం, నాన్‌వెబ్‌ తినడం మానేశానని తెలిపారు. 

తెలుగులో సినిమా చేయడంపై రియాక్ట్ అవుతూ, కొత్త దనాన్ని ఆదరించడంలో తెలుగు ఆడియెన్స్ ముందుంటారు. `మన్మథ` సినిమా సమయంలో ఇక్కడి థియేటర్లలో ఆడియెన్స్ మధ్య సినిమా చూశా. నేను ఎవరో వాళ్లకి తెలియదు. అయినా సినిమా నచ్చి నన్ను ఆదరించారు. అంతేకాదు కొందరు తమ సొంతం డబ్బుతో ఈ హీరోకి కటౌట్‌ పెట్టాలని మాట్లాడుకోవడం ఎమోషనల్‌కి గురి  చేసిందన్నారు. ఇదిలా ఉంటే తన పెళ్లిపై స్పందిస్తూ మంచి అమ్మాయి దొరికితే చేసుకుంటానన్నారు.

also read: 

వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో రూపొందిన `ది లూప్‌` సినిమా గురించి చెబుతూ,  `సైన్స్‌ ఫిక్షన్‌ కథాంశంతో తెరకెక్కుతున్న పొలిటికల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రమిది. రాజకీయ చదరంగంలో ఓ సామాన్యుడికి ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి? అతడి జీవితంలో ఒకే సంఘటన మళ్లీ మళ్లీ ఎందుకు జరిగింది? తనపై పడిన ఓ నింద నుంచి అతడు ఎలా నిరపరాధిగా బయటపడ్డాడన్నదే ఈ చిత్ర ఇతివృత్తం. వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కిన సినిమా కాదిది. కానీ ఇందులో చూపించిన అంశాలతో ప్రేక్షకులు కనెక్ట్‌ అవుతారు. రాజకీయస్వార్థం కోసం సామాన్యులను రాజకీయనాయకులు ఎలా పావులుగా వాడుకుంటారో ఇందులో చూపించామ`న్నారు. 

also read: ఆసుపత్రిలో చేరిన కమల్ హాసన్.. కరోనా పాజిటివ్, ఆందోళనలో అభిమానులు
 

click me!