Bigg boss telugu5: బిగ్ బాస్ విన్నర్ ఎవరో తేల్చిన సర్వే... టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ వీరే, యాంకర్ రవికి నిరాశే!

Published : Nov 22, 2021, 04:29 PM ISTUpdated : Nov 22, 2021, 04:30 PM IST
Bigg boss telugu5: బిగ్ బాస్ విన్నర్ ఎవరో తేల్చిన సర్వే... టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ వీరే, యాంకర్ రవికి నిరాశే!

సారాంశం

బిగ్ బాస్ సీజన్ ఫైవ్ మరో (Bigg boss telugu5) నాలుగు వారాల్లో ముగియనుంది. దీంతో టైటిల్ విన్నర్ ఎవరంటే ఉత్కంఠ అందరిలో మొదలైపోయింది. ప్రేక్షకులలో నెలకొన్న ఆసక్తిరీత్యా పలు సంస్థలు విన్నర్ ఎవరనే విషయంపై సర్వేలు నిర్వహిస్తున్నాయి. 

తాజాగా ఓ సంస్థ సర్వే బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ఎవరో తేల్చేసింది. బిగ్ బాస్ సీజన్ 5 టైటిల్ తీసుకెళ్లే కంటెస్టెంట్ నేమ్ రివీల్ చేయడం జరిగింది. అనేక మంది బిగ్ బాస్ ప్రేక్షకుల అభిప్రాయాలు సేకరించి, బిగ్ బాస్ విన్నర్ ఎవరో నిర్ణయించడం జరిగింది. సదరు సంస్థ రిజల్ట్ ప్రకారం యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్ (Shanmuk jaswanth) బిగ్ బాస్ 5 టైటిల్ గెలుచుకుంటాడట. షణ్ముఖ్ బిగ్ బాస్ విన్నర్, అతడికే మా ఓటు అంటూ మెజారిటీ ఆడియన్స్ అభిప్రాయం వెల్లడించడం జరిగింది. 


షణ్ముఖ్ తర్వాత బిగ్ బాస్ టైటిల్ గెలిచే ఛాన్స్ సన్నీకి ఉందని ప్రేక్షకులు తమ అభిప్రాయం వెల్లడించారు. నోటి దురుసు, మాట తీరు, బాడీ లాంగ్వేజ్ తో కొంచెం నెగిటివ్ ఇమేజ్ తెచ్చుకున్నప్పటికీ అటాకింగ్ గేమ్ ఆడుతున్న సన్నీ (Sanny) కి షణ్ముఖ్ తర్వాత ఓట్లు పడ్డాయట. కాబట్టి బిగ్ బాస్ సీజన్ 5 రన్నర్ గా సన్నీ నిలుస్తాడని అంటున్నారు. 


కంటెస్టెంట్స్ ప్రకటన జరిగిన నాటి నుండి టైటిల్ విన్నర్ యాంకర్ రవి అంటూ, చాలా మంది డిసైడ్ అయ్యారు. 19 మంది కంటెస్టెంట్స్ లో ఫేమ్, నేమ్ పరంగా యాంకర్ రవి (Anchor Ravi) ముందున్నాడు. కాబట్టి తనే టైటిల్ కొట్టేస్తాడని చాలా మంది భావించారు. అయితే రవికి ఆడియన్స్ మూడవ స్థానం ఇచ్చారు. షణ్ముఖ్,సన్నీ తర్వాత స్థానం అనగా మూడవ ప్లేస్ రవికి దక్కిందట. ఈ ముగ్గురు కంటెస్టెంట్స్ తర్వాత సింగర్ శ్రీరామ్ కి అధికంగా ప్రేక్షకులు ఓట్లు వేశారు. ఇక టాప్ ఫైవ్ లో మానస్ కి చోటు దక్కిందట. 

Also read Bigg boss telugu 5: కాజల్, సన్నీ ఫ్యాన్స్ కి కమెడియన్ సుదర్శన్ క్షమాపణలు
ఆ సంస్థ సర్వే ప్రకారం షణ్ముఖ్, సన్నీ, రవి, శ్రీరామ్, మానస్ ఫైనల్ కి వెళతారట. వీరిలో షణ్ముఖ్ టైటిల్ విన్నర్, సన్నీ రన్నర్ గా నిలుస్తారట. అయితే ఈ సంస్థ సర్వే వందశాతం కరెక్ట్ అవుతుందని చెప్పలేము. నెలరోజుల సమయం ఉన్న నేపథ్యంలో ఫలితాలు అటూ ఇటూ కావచ్చు. నవంబర్ 13నుండి 19వరకు జరిగిన సర్వే ఫలితాలుగా వీటిని వెల్లడించారు. 

Also read హీరో కాదు కమెడీయన్ మాత్రమే..సన్నీని ఫూల్‌ని చేసిన నాగ్‌ అండ్‌ కో.. ప్రియాంక ఇజ్జత్‌ తీసిందిగా!


 

PREV
click me!

Recommended Stories

Balakishna: `అఖండ 2` డిజాస్టర్‌ దెబ్బ.. బాలయ్య కొత్త సినిమాకి బడ్జెట్‌ కష్టాలు.. ఆగిపోయిందా?
ప్రభాస్ జోకర్ గెటప్ వెనుకున్న వ్యక్తి ఎవరంటే.? మనసులోని మాట చెప్పిన డైరెక్టర్ మారుతీ