హీరో సత్యదేవ్ ను అరెస్ట్ చేసిన ఆఫ్గన్ పోలీసులు.. ఎలా తప్పించుకున్నాడంటే..?

Published : Dec 10, 2022, 04:34 PM IST
హీరో సత్యదేవ్ ను అరెస్ట్ చేసిన ఆఫ్గన్ పోలీసులు.. ఎలా తప్పించుకున్నాడంటే..?

సారాంశం

ప్రస్తుతం టాలీవుడ్  ఇండస్ట్రీలో హాట్ టాపక్ గా మారాడు సత్యదేవ్. వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న ఈ యంగ్ హీరో.. అటు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా స్టార్ ఇమేజ్ సాధించాడు. తన కెరీర్ లో జరిగిన కొన్ని అద్భుతాలను ఆడియనస్  తో పంచుకున్నాడు సత్యదేవ్.    


సత్యదేవ్ టాలీవుడ్ హీరో కాని.. హీరోగానే నటించాలి అని గిరి గీసుకుని లేడు.. వైవిధ్యభరితమైన పాత్రలను పోషిస్తూ... టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నాడు. తెలుగు ఫిల్మ్ఇండస్ట్రీలో తన స్థానాన్ని సుస్థిరంచేసుకుంటున్నాడు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ముందుకు సాగుతున్నాడు. చిన్న పాత్రలతో తన కెరీర్ ను ప్రారంభించి, లీడ్ రోల్స్ చేసే స్థాయికి ఎదిగాడు. మరోవైపు తన జీవితంలో ఎదురైన ఒక భయానక అనుభవాన్ని ఓ ఇంటర్వ్యూలో ఆయన పంచుకున్నాడు. 

ఒక సారి ఓ సినిమా షూటింగ్ కోసం ఆఫ్ఘనిస్థాన్ కు వెళ్లారట టీమ్. అప్పుడు తనకు ఓ విచిత్రమైన అనుభవం ఎదురైంద అన్నాడు సత్యదేవ్.  అక్కడ షూటింగ్  కంప్లీట్ చేసుకుని వస్తుండగా...  ఎయిర్ పోర్టులో సడెన్ గా సత్యదేవ్ నుఅరెస్ట్ చేశారట అక్కడి పోలీసులు. అయితే తనను ఎందుకు అరె్స్ట్ చేశారో తెలియక.. అక్కడ ఎంక్వౌరీ చేయడగా..  తనను సూసైడ్ బాంబర్ అనుకుని పోలీసులు అరెస్ట్ చేశారని తెలిసింది.

ఇక  సూసైడ్ బాంబర్స్ కాలికింద ట్రిగ్గర్ పెట్టుకుని అవసరమైనప్పుడు ఆపరేట్ చేస్తారని... ఎయిర్ పోర్టులో తన పక్కన కూర్చున్న వ్యక్తి తన కాలు కింద ఉన్న దేన్నో తీయడానికి ప్రయత్నిస్తున్నాడని.... దీంతో పోలీసులకు అనుమానం వచ్చి వెంటనే ఆయనను, పక్కనున్న తనను అరెస్ట్ చేశారని తెలిపాడు. 

అయితే ఈ గలాట జరుగుతుండగానే తన మూవీ టీమ్ కొంత మంది వచ్చి అసలు విషయం వారికి చెప్పి.. సత్యదేవ్ ను విడిపించినట్టు తెలుస్తోంది  తమ చిత్ర బృందం వచ్చి తాము షూటింగ్ కోసం వచ్చామని చెప్పడంతో వదిలేశారని చెప్పాడు. ఆ సంఘటన తన జీవితం లో మర్చిపోలేను అన్నారు సత్యదేవ్. 

PREV
click me!

Recommended Stories

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి విలన్ గా రెండు నిమిషాలు మాత్రమే కనిపించిన సినిమా ఏదో తెలుసా?
OTT: ఒకే రాత్రి 3 హ‌త్య‌లు, ఊహ‌కంద‌ని ట్విస్టులు, ప్ర‌తీ సీన్ క్లైమాక్సే.. ఓటీటీలో సూప‌ర్ థ్రిల్ల‌ర్