పవన్‌ కళ్యాణ్‌, హరీష్‌ శంకర్‌ మూవీ గ్రాండ్‌ ఓపెనింగ్ కి టైమ్‌ ఫిక్స్... టైటిల్ అదేనా?

Published : Dec 10, 2022, 02:44 PM ISTUpdated : Dec 10, 2022, 03:24 PM IST
పవన్‌ కళ్యాణ్‌, హరీష్‌ శంకర్‌ మూవీ గ్రాండ్‌ ఓపెనింగ్ కి టైమ్‌ ఫిక్స్... టైటిల్ అదేనా?

సారాంశం

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ వరుసగా సినిమాలు ప్రకటిస్తున్నారు. ఇటీవల సుజీత్‌ మూవీ ప్రకటించారు. ఇప్పుడు హరీష్‌ సినిమాని అధికారికంగా ప్రారంభించబోతున్నారు. గ్రాండ్‌గా పూజా కార్యక్రమాలు నిర్వహించబోతున్నారట. 

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌, హరీష్‌ శంకర్‌ కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. `భవదీయుడు భగత్‌ సింగ్‌` స్క్రిప్ట్ ని పక్కన పెట్టి `థెరి` రీమేక్‌ చేస్తున్నారని టాక్‌. ఇందులోనూ హీరో పోలీస్‌ కావడం, అమ్మాయిలపై జరిగే అన్యాయాలపై హీరో పోరాడటం అనే ఎలిమెంట్‌ ఉన్న నేపథ్యంలో దాన్ని బేస్ చేసుకుని ఈ సినిమాని తెరకెక్కించబోతున్నారట. పైగా ఈ సినిమా రీమేక్‌ చేయడం వల్ల పవన్‌  షూటింగ్‌లో పాల్గొనే డేట్స్ తక్కువ అవుతాయట. నెల రోజుల్లో పూర్తి చేయోచ్చని భావిస్తున్నారట. అందుకే రీమేక్‌ చేస్తున్నారని సమాచారం. 

పైగా పవన్‌ ఇప్పుడు ఒరిజినల్‌ స్టోరీస్‌తో ప్రయోగాలు చేసే ఆలోచనలో లేదు. ఆయన ఆలోచన మొత్తం రాజకీయాలపై ఉంది. ఈ లోపు సినిమాలు చేయడం వల్ల ఎంతో కొంత పారితోషికం రాబట్టుకోవాలనుకుంటున్నారట. అవి రాజకీయ ప్రచారం కోసం ఉపయోగించుకోవాలనుకుంటున్నారట. అందుకే రీమేక్‌కి మొగ్గు చూపుతున్నారని సమాచారం. ఇదిలా ఉంటే పవన్‌ ప్రస్తుతం నటిస్తున్న `హరిహరవీరమల్లు` చిత్ర షూటింగ్‌ చివరిదశలో ఉండగానే హరీష్‌ సినిమాని పట్టాలెక్కియాలని భావిస్తున్నారట. 

ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ క్రేజీ అప్‌డేట్‌ నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాని రేపు గ్రాండ్‌గా లాంచ్‌ చేయబోతున్నారట. ఆదివారం(డిసెంబర్‌ 11)న హైదరాబాద్‌లో గ్రాండ్‌గా పూజా కార్యక్రమాలు నిర్వహించబోతున్నారని తెలుస్తుంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. పవన్ తో హరీష్ తెరకెక్కిస్తున్న మూవీ గతంలో ప్రకటించిన భవదీయుడు భగత్ సింగ్ కాదని, తమిళ హిట్ మూవీ తేరి రీమేక్ అని ప్రచారం జరుగుతుంది. తేరి రీమేక్ వద్దని ఫ్యాన్స్ పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు. దర్శకుడు హరీష్ ని సోషల్ మీడియా వేదికగా ఏకిపారేశారు. తేరి రీమేక్ చేయాలని మేకర్స్, పవన్ డిసైడైన నేపథ్యంలో హరీష్ కి ఛాయిస్ లేదు. ఇక ఫ్యాన్స్ నిరసనలు దృష్టిలో ఉంచుకొని తేరి రీమేక్ టైటిల్ గా భవదీయుడు భగత్ సింగ్ ఉంచుతారట. భవదీయుడు భగత్ సింగ్ స్క్రిప్ట్ పక్కన పెట్టేశారట. అలాగే తేరి కథకు సమూల మార్పులు చేస్తారట. టాలీవుడ్లో ఈ ప్రచారం గట్టిగా జరుగుతుంది.

ప్రస్తుతం పవన్‌ క్రిష్‌ దర్శకత్వంలో `హరిహర వీరమల్లు` చిత్రంలో నటిస్తున్నారు. చాలా గ్యాప్ తర్వాత శరవేగంగా ఈ సినిమాని  చిత్రీకరిస్తున్నారు. దీనికి పవన్‌ బల్క్ డేట్స్ ఇచ్చారట. త్వరగా ఈ చిత్ర షూటింగ్‌ పూర్తి చేసే పనిలో ఉన్నారని టాక్.

మరోవైపు పవన్‌ ఇటీవలే సుజీత్‌ సినిమాకి గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. ఒరిజినల్‌ స్టోరీతో దీన్ని తెరకెక్కించబోతున్నారు. `ఒరిజినల్‌ గ్యాంగ్‌స్టర్‌` కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారట. డివివి దానయ్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమా రెగ్యూలర్‌ షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందనేదానిపై క్లారిటీ లేదు. మరోవైపు సముద్రఖనితోనూ `వినోదయ సీతం` చిత్రం రీమేక్‌ చేయాల్సి ఉంది. దీన్ని పక్కన పెట్టారని టాక్‌. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

49 ఏళ్ల వయసులో ఇండియాకు మెడల్ సాధించిన నటి, ఏకంగా 4 పతకాలతో మెరిసిన ప్రగతి
Rithu Remuneration బిగ్ బాస్ విన్నర్ రేంజ్ లో పారితోషికం, రీతూ చౌదరి ఎలిమినేషన్ కు కారణాలు ఇవే ?