ప్రభాస్ తో మళ్ళీ మూవీ... అది ఎలా ఉంటుందో చెప్పిన రానా!

Published : Jul 17, 2024, 08:55 PM ISTUpdated : Jul 17, 2024, 09:03 PM IST
ప్రభాస్ తో మళ్ళీ మూవీ... అది ఎలా ఉంటుందో చెప్పిన రానా!

సారాంశం

దగ్గుబాటి రానా-ప్రభాస్ కాంబినేషన్ జనాలు ఎన్నటికీ మర్చిపోలేరు. వారు నటించిన బాహుబలి, బాహుబలి 2 ఇండియన్ బాక్సాఫీస్ షేక్ చేశాయి. మళ్ళీ ప్రభాస్ తో మూవీపై రానా తాజాగా స్పందించారు.   

ఇమేజ్ ఛట్రంలో ఇరుక్కోకుండా విలక్షణ సబ్జక్ట్స్ ఎంచుకుంటూ ముందుకు వెళుతున్నాడు దగ్గుబాటి రానా. ఆయన నటించిన కృష్ణం వందే జగద్గురుమ్, ఘాజీ, అరణ్య, విరాటపర్వం ప్రయోగాత్మక చిత్రాలు అని చెప్పొచ్చు. రానా ఎప్పుడూ ఛాలెంజింగ్ రోల్స్ చేసేందుకు ఆసక్తి చూపుతారు. కాగా రానా సిల్వర్ స్క్రీన్ పై కనిపించి రెండేళ్లు దాటిపోయింది. 2022లో విడుదలైన విరాటపర్వం, 1945 ఆయన హీరోగా నటించిన చివరి చిత్రాలు. స్పై మూవీలో ఓ గెస్ట్ రోల్ చేశాడు. 

తాజాగా గ్యాప్ రావడంపై రానా స్పందించారు. ఆయన మాట్లాడుతూ... నేడు మొదటి నుండి కొత్త కథలతో కూడిన చిత్రాలు చేశాను. ఇప్పుడు చాలా మంది అలాంటి కథలను ఎంచుకుంటున్నారు. నేను మంచి సబ్జెక్ట్స్ కోసం ఎదురు చూస్తున్నాను. రెండేళ్లు అలా గడిచిపోయాయి. త్వరలోనే నా కొత్త ప్రాజెక్ట్ కి సంబంధించిన ఆసక్తికర విషయాలు తెలియజేస్తాను.. అన్నారు. 

లీడర్ 2 ఉంటుందని చాలా కాలంగా ప్రచారం జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్ ని ఉద్దేశించి రానా మాట్లాడారు. లీడర్ 2 ఎప్పుడో మీరు శేఖర్ కమ్ములను అడగాలని సరదాగా అన్నారు. ప్రభాస్ తో మీరు మరలా ఎప్పుడు స్క్రీన్ షేర్ చేసుకుంటారని?..   రానా కు ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. మేమిద్దరం కలిసి మూవీ చేస్తే అది ఖచ్చితంగా చాలా స్పెషల్ గా ఉంటుంది. కుదిరితే అలాంటి మూవీ చేస్తాము... అన్నారు. 

కల్కి సక్సెస్ నేపథ్యంలో ఆయన ఆనందం వ్యక్తం చేశారు. కల్కి చిత్రానికి పని చేసినవారందరు నాకు బాగా తెలిసినవారు. కల్కి విజయం సాధించడం సంతోషాన్ని ఇచ్చింది. విడుదలకు ముందే భారీ విజయం సాధిస్తుందని అంచనా వేశాను. కల్కి ఊహకు మించిన విజయం అందుకుంది... అన్నారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

RajaSaab కి ఒకవైపు నెగిటివ్ టాక్ వస్తుంటే హీరోయిన్ ఏం చేస్తోందో తెలుసా.. బన్నీని బుట్టలో వేసుకునే ప్రయత్నం ?
Illu Illalu Pillalu Today Episode Jan 13: డబ్బు పోగొట్టిన సాగర్, అమూల్యకు పెళ్లి ఇష్టం లేదన్న వేదవతి