డబుల్ ఇస్మార్ట్ మూవీ సాంగ్ వివాదం.. మాజీ ముఖ్యమంత్రి మాటని ఇలా వాడుకుంటారా..

Published : Jul 17, 2024, 07:04 PM IST
డబుల్ ఇస్మార్ట్ మూవీ సాంగ్ వివాదం.. మాజీ ముఖ్యమంత్రి మాటని ఇలా వాడుకుంటారా..

సారాంశం

రీసెంట్ గా విడుదలైన మార్ ముంత చోడ్ చింత అనే సాంగ్ యూట్యూబ్ లో దూసుకుపోతోంది. సంగీత దర్శకుడు మణిశర్మ అదిరిపోయే మాస్ బీట్ ఇచ్చారు. రామ్ డ్యాన్స్ తో, కావ్య థాపర్ గ్లామర్ తో చెలరేగిపోతున్నారు. పాజిటివ్ గా ఈ సాంగ్ కి సూపర్ ఫీడ్ బ్యాక్ వస్తోంది అనుకుంటున్న తరుణంలో వివాదం మొదలయింది.

పూరి జగన్నాధ్ తెరకెక్కించిన డబుల్ ఇస్మార్ట్ చిత్రం ఆగష్టు 15న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇస్మార్ట్ శంకర్ చిత్రానికి సీక్వెల్ గా ఈ మూవీ తెరకెక్కుతోంది. రిలీజ్ టైం దగ్గర పడుతుండడంతో ప్రచార కార్యక్రమాలు మొదలు పెట్టారు. రీసెంట్ గా విడుదలైన మార్ ముంత చోడ్ చింత అనే సాంగ్ యూట్యూబ్ లో దూసుకుపోతోంది. 

సంగీత దర్శకుడు మణిశర్మ అదిరిపోయే మాస్ బీట్ ఇచ్చారు. రామ్ డ్యాన్స్ తో, కావ్య థాపర్ గ్లామర్ తో చెలరేగిపోతున్నారు. పాజిటివ్ గా ఈ సాంగ్ కి సూపర్ ఫీడ్ బ్యాక్ వస్తోంది అనుకుంటున్న తరుణంలో వివాదం మొదలయింది. ఇటీవల ఫిలిం మేకర్స్ ట్రెండింగ్ అంశాలని తమ చిత్రాల్లో వాడుకోవడానికి ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. 

నితిన్ ఎక్స్ట్రా చిత్రంలో షర్మిల డైలాగ్ ని వాడుకున్నారు. మహేష్ బాబు గుంటూరు కారం చిత్రంలో సోషల్ మీడియాలో పాపులర్ అయిన కుర్చీ మడత పెట్టి అనే మాటతో సాంగ్ చేశారు. ఇప్పుడు పూరి జగన్నాధ్ డబుల్ ఇస్మార్ట్ చిత్రంలో రీసెంట్ గా విడుదలైన సాంగ్ లో ఏకంగా మాజీ ముఖ్యమంత్రి మాటనే వాడేశారు. 

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఒకసారి ప్రెస్ మీట్ లో 'ఏం చేద్దాం అంటావ్ మరి' అని అన్నారు. ఆ మాటని కేసీఆర్ తరచుగా వాడుతుంటారు. దానినే డబుల్ ఇస్మార్ట్ సాంగ్ లో వాడేశారు. దీనిపట్ల కేసీఆర్ అభిమానుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. 

మాజీ ముఖ్యమంత్రి మాటని ఒక కల్లు దుకాణంలో అశ్లీలంగా వచ్చే పాటలో వాడుకోవడం ఏంటని కేసీఆర్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. వెంటనే ఆ మాటని తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. మరి దీనిపై డబుల్ ఇస్మార్ట్ టీం ఎలా స్పందిస్తుందో చూడాలి. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss 9 లో ముద్దుల గోల , డార్క్ రూమ్ లో వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారు, దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు
Chiranjeevi: సౌందర్య సినిమా చూసి చేతులు కాల్చుకున్న చిరంజీవి, ఇదెక్కడి గొడవరా అని తలపట్టుకున్న డైరెక్టర్