
నాగ చైతన్య కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ లో తెరకెక్కుతున్న చిత్రం తండేల్. కార్తికేయ 2 లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ కొట్టిన చందు ముండేటి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. మొదటి నుంచి ఈ చిత్రంపై హైప్ పెంచుతున్నారు. చైతు ఈ చిత్రంలో బోట్ నడిపే మత్స్యకారుడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ చిత్రంలో నాగ చైతన్యకి జోడిగా సాయి పల్లవి నటిస్తోంది. తాజాగా నిర్మాత అల్లు అరవింద్, డైరెక్టర్ చందూ ముండేటి, ఇతర తండేల్ చిత్ర యూనిట్ సాయి పల్లవిని సత్కరించారు. అల్లు అరవింద్ దగ్గరుండి సాయి పల్లవి చేత కేక్ కట్ చేయించారు. దీనికి కారణం ఉంది.
కెరీర్ బిగినింగ్ నుంచి సాయి పల్లవి తన నటనతో అదరగొడుతోంది. కొన్ని చిత్రాల్లో హీరోని సైతం డామినేట్ చేసేలా పెర్ఫామ్ చేస్తోంది. డ్యాన్సుల విషయంలో కూడా సాయి పల్లవికి తిరుగులేదు. ఇంత ప్రతిభ ఉన్న నటికి ఎలాంటి అవార్డు అయినా దాసోహం అనాల్సిందే.
ఇటీవల ప్రకటించిన ఫిలిం ఫేర్ అవార్డ్స్ లో సాయి పల్లవి రెండు చిత్రాలకు అవార్డులు గెలుచుకుంది. గార్గి, విరాటపర్వం చిత్రాలకి ఆమె అవార్డు దక్కించుకుంది. దీనితో తండేల్ చిత్ర యూనిట్ ఆమెని సత్కరించారు. తండేల్ సెట్స్ లో సెలెబ్రేషన్స్ చేశారు. సాయి పల్లవి తన కెరీర్ మొత్తంలో ఇప్పటి వరకు 6 ఫిలిం ఫేర్ అవార్డులు గెలుచుకుంది.