ఎన్టీఆర్ ఇంట్లో రానా పెళ్లిచూపులు!

Published : Sep 02, 2018, 01:20 PM ISTUpdated : Sep 09, 2018, 12:41 PM IST
ఎన్టీఆర్ ఇంట్లో రానా పెళ్లిచూపులు!

సారాంశం

దర్శకుడు క్రిష్ 'ఎన్టీఆర్' బయోపిక్ ను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో సీనియర్ ఎన్టీఆర్ ఇంట్లో జరుగుతోంది. ఆబిడ్స్ లోని ఎన్టీఆర్ పాత ఇంట్లో క్రిష్ కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

ఈ సినిమా హీరో రానా.. చంద్రబాబు పాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. కథలో ఈ పాత్ర చాలా కీలకమైంది. ప్రస్తుతం రానాకి సంబంధించిన సన్నివేశాలను ఎన్టీఆర్ ఇంట్లో చిత్రీకరిస్తున్నారు. తొలిసారి ఆ ఇంట్లో అడుగుపెట్టినప్పుడు భావోద్వేగానికి లోనయ్యానని అన్న గారు నడిచిన చోట, ఆయన పడక గదిలో తిరగడం గొప్ప అనుభూతిని కలిగించిందని రానా అన్నాడు.

తెలుగు సినిమాలపై, ఆ తరువాత రాజకీయాలపై ఎన్టీఆర్ ప్రభావం ఉందని అటువంటి గొప్ప వ్యక్తి బయోపిక్ లో నటించడం తన అదృష్టమని అన్నాడు. తొలిసారి ఎన్టీఆర్ ఇంటికి వెళ్లిన చంద్రబాబు ఆయన దృష్టిలో పడడం, భువనేశ్వరితో చంద్రబాబు పెళ్లిచూపులు వంటి సన్నివేశాలను రానాపై చిత్రీకరిస్తున్నారని టాక్.   

PREV
click me!

Recommended Stories

Akhanda 2 Review: 'అఖండ 2' మూవీ రివ్యూ, రేటింగ్.. బాలకృష్ణ తాండవం ఎలా ఉందో తెలుసా ?
సపోర్ట్ చేసినందుకు వెన్నుపోటు పొడిచిన కళ్యాణ్, మనస్తాపానికి గురైన భరణి.. తనూజ ఏడుపు ఫేక్ అంటూ ముఖం మీదే