కెజిఎఫ్ డైరెక్టర్ కి రామ్ చరణ్ బర్త్ డే విషెస్!

Published : Jun 04, 2023, 03:58 PM IST
కెజిఎఫ్ డైరెక్టర్ కి రామ్ చరణ్ బర్త్ డే విషెస్!

సారాంశం

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కి బర్త్ డే విషెస్ తెలియజేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా స్పందించారు.   

కెజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ బర్త్ డే నేడు. ఆయనకు అభిమానులు, చిత్ర ప్రముఖులు బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రశాంత్ నీల్ కి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. హ్యాపీ బర్త్ డే బ్రదర్. మీరు సుఖ సంతోషాలతో బాగుండాలని కోరుకుంటున్నాను... అంటూ ట్వీట్ చేశారు. రామ్ చరణ్ ట్వీట్ వైరల్ గా మారింది. చరణ్ ఫ్యాన్స్ కామెంట్స్ తో హోరెత్తిస్తున్నారు. 

ప్రస్తుతం ప్రశాంత్ నీల్ హీరో ప్రభాస్ తో సలార్ చిత్రం చేస్తున్నారు. అనంతరం ఎన్టీఆర్ తో మూవీకి కమిట్ అయ్యారు. దీనిపై అధికారిక ప్రకటన కూడా వచ్చింది. వచ్చే ఏడాది సమ్మర్ లో ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. రామ్ చరణ్ తో ప్రశాంత్ నీల్ మూవీ చేసే అవకాశం కలదు. ఒకటి రెండు సందర్భాల్లో రామ్ చరణ్-ప్రశాంత్ నీల్ ఈ ప్రాజెక్ట్ విషయమై కలిశారు. 

కాగా రామ్ చరణ్ దర్శకుడు శంకర్ తో గేమ్ ఛేంజర్ చేస్తున్నారు. ఇది పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతుంది. రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నారని సమాచారం. అలాగే దర్శకుడు బుచ్చిబాబుతో ఓ మూవీ ప్రకటించారు. ఈ ఏడాది చివర్లో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కే సూచనలు కలవు. ఆర్ ఆర్ ఆర్ మూవీతో భారీ ఫేమ్ రాబట్టిన రామ్ చరణ్ తో చిత్రాలు చేసేందుకు బాలీవుడ్ మేకర్స్ సైతం సిద్ధంగా ఉన్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Ashika Ranganath: దాదాపు 30 ఏళ్ళ వయసు తేడా ఉన్న ముగ్గురు హీరోలతో రొమాన్స్.. హీరోయిన్ రియాక్షన్ వైరల్
చివరి నిమిషంలో ప్లేట్ తిప్పేశారు, ఇమ్మాన్యుయేల్ కి మొండి చేయి.. బిగ్ బాస్ పై దుమ్మెత్తి పోస్తున్న రోహిణి