నన్ను ఇంకా ఇండస్ట్రీలో తొక్కేయాలనే చూస్తున్నారు.. హీరో సిద్ధార్థ్ సంచలన వ్యాఖ్యలు

Published : Jun 04, 2023, 02:20 PM IST
నన్ను ఇంకా ఇండస్ట్రీలో  తొక్కేయాలనే చూస్తున్నారు.. హీరో సిద్ధార్థ్ సంచలన వ్యాఖ్యలు

సారాంశం

ఈమధ్య సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతున్నాడు సౌత్ హీరో సిద్దార్థ్.  గతంలో చేసిన వ్యాఖ్యలకు ఇబ్బందులు పడిన ఈహీరో.. తాజాగా మరోసారి రెచ్చిపోయాడు.   

బొమ్మరిల్లు లాంటిసినిమాలతో టాలీవుడ్ లో పాతుకుపోయిన హీరో సిద్దార్ధ్... ఇక్కడ వరుస సినిమా ఆఫర్లు కొట్టేశాడు. అంతే కాదు టాలీవుడ్ లో స్టార్ హీరోల రేంజ్ కు రాబోతున్నాడు అనుకున్న టైమ్ కు.. టాలీవుడ్ మీద పిచ్చి పిచ్చిగా మాట్లాడి తెలుగు ఇండస్ట్రీకి దూరం అయ్యాడు. ఇక్కడ అసలు ఆఫర్లు లేకుండా చేతులారా చేసుకున్నాడు సిద్దార్థ్. ఇక ఈమధ్యే మళ్లీ మహాసముద్రం సినిమా నుంచి తెలుగులో అవకాశాలు వస్తున్నాయి ఈ హీరోకి. 

ఈ క్రమంలోనే సిద్ధార్థ్ తాజాగా నటించిన టక్కర్ సినిమా జూన్ 9న తెలుగు తమిళ భాషలలో  రిలీజ్ కు రెడీగా ఉంది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి సిద్ధార్థ్ మరోసారి రెచ్చిపోయి మాట్లాడాడు. ఇండస్ట్రీలో తనపై చాలామంది కుట్ర చేశారని సంచలన కామెంట్లు చేశాడు. ఇంకా  తనని తొక్కేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి  అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

అయితే తాను తెలుగులో నటిచిన బొమ్మరిల్లు, నువ్వు వస్తావంటే నేనొద్దంటాన లాంటిసినిమాలు  పెద్ద ఎత్తున థియేటర్లలో ఆడాయి. అంతకంటేఎక్కువగా  అవార్డులు కూడా వచ్చాయని తెలిపారుసిద్దు. అంతే కాదు  బొమ్మరిల్లు సినిమాకు 14 నంది అవార్డులు రాగా నువ్వు వస్తానంటే నేనొద్దంటానా సినిమాకు 11 నంది అవార్డులు వచ్చాయి వివిధ కేటగిరీలలో ఈ సినిమాలకు ఇన్ని అవార్డులు వచ్చిన నాకు మాత్రం ఒక అవార్డు కూడా రాలేదని తెలిపారు. 

అంతే కాదు ఆటైమ్ లో కొంత మంది కావాలనే తనను తొక్కేయడానికే ఇలా చేశారంటున్నాడుసిద్దు.ఆ సమయంలో కొందరు ఉద్దేశపూర్వకంగానే నాకు ఈ అవార్డు రాకుండా చేశారని ఇండస్ట్రీలో నన్ను తొక్కేసే ప్రయత్నాలు కూడా జరిగాయని సిద్ధార్థ్ తెలిపారు. ప్రస్తుతం తెలుగులో మళ్లీ పుంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు సిద్దు. మరి మనోడి ప్రయత్నాలు ఎంత వరకూ ఫలిస్తాయో చూడాలి. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా
Demon Pavan: తాను విన్నర్ కాదని తెలుసు, రవితేజతో బేరమాడి భారీ మొత్తం కొట్టేసిన డిమాన్ పవన్.. లక్ అంటే ఇదే