
వందల చిత్రాల్లో కమెడియన్ గా నటించిన అలీ కెరీర్ చాలా సుదీర్ఘమైనది. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన అలీ ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. అలీ ప్రస్తుతం సినిమాల్లో బిజీగా కొనసాగుతూనే రాజకీయాల్లో సైతం తనదైన పరిథిలో ముద్ర వేస్తున్నారు. అలీ ప్రస్తుతం ఏపీ ఎలెక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా పనిచేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ మేరకు సీఎం జగన్ ఆయన్ని సలహాదారుగా నియమించారు. ఇదిలా ఉండగా కొన్ని నెలల క్రితం అలీ కుమార్తె వివాహం జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అలీ ఫ్యామిలీ తమ వియ్యంకులు ఫ్యామిలీతో కలసి సరదాగా గడుపుతున్నారు. ఇటీవల అలీ కుమార్తె ఫాతిమా తన అత్తగారి ఫ్యామిలీతో కలసి ఇంటికి వచ్చింది.
దీనితో విందు కార్యక్రమాలు బాగానే జరిగాయి. ఆ తర్వాత ఇరు కుటుంబాలు కలసి ఎక్కడికైనా వెకేషన్ వెళ్లాలని అనుకున్నారు. వెంటనే ప్లాన్ చేసుకుని బయలుదేరారు. అయితే అలీ వీరితో ప్రయాణించలేదు. తనకున్న బిజీ షెడ్యూల్ కారణంగా అలీ హైదరాబాద్ లోనే ఉండాల్సి వచ్చింది. అలీ భార్య జుబేదా.. వారి పిల్లలు, వియ్యంకులు కలసి వెకేషన్ కి వెళ్లారు.
కానీ ఫ్లైట్ లో ఊహించని ప్రమాదం నుంచి తామంతా సేఫ్ గా బయట పడ్డట్లు జుబేదా తన యూట్యూబ్ వీడియోలో పేర్కొంది. ఫ్లైట్ ప్రయాణించే సమయంలో పెద్ద తుఫాన్ వచ్చిందట. దీనితో ఫ్లైట్ భారీ కుదుపులకు గురైంది. ప్రయాణికులకు ఈ విషయాని తెలియాజేస్తూ పైలట్ కూడా అనౌన్స్ చేశారట.
తుఫాన్ నుంచి తప్పించేందుకు పైలెట్ తీవ్రంగా శ్రమించినట్లు పేర్కొంది. కొన్నిసార్లు విమానాన్ని బాగా ఎత్తుకు తీసుకువెళ్లడం.. కొన్ని సార్లు ఎత్తు తగ్గించడం చేస్తూ వచ్చారట. దీనితో విమానం కుదుపులకు గురి కావడంతో ప్రయాణికులంతా భయాందోళనకు గురైనట్లు జుబేదా తెలిపింది. అరగంట ఆలస్యంగా ఫ్లైట్ సేఫ్ గా ల్యాండ్ కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇంత భయంకరమైన ప్రయాణం తానెప్పుడూ చేయలేదని జుబేదా చెబుతూ గుండె ఆగినంత పని అయిందని తెలిపింది.