షాక్.. ఆగిపోయిన రామ్ చరణ్ ప్రాజెక్ట్!

Published : Aug 30, 2022, 01:04 PM IST
షాక్.. ఆగిపోయిన రామ్ చరణ్ ప్రాజెక్ట్!

సారాంశం

యంగ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరికి రామ్ చరణ్ షాక్ ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆయన ఈ ప్రాజెక్ట్ పక్కన పెట్టేశారట. కొత్త స్క్రిప్ట్స్ పై ఫోకస్ పెట్టారట.  

మళ్ళీరావా, జెర్సీ చిత్రాలతో గౌతమ్ టాలెంటెడ్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరారు. ఈ రెండు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. ముఖ్యంగా జెర్సీ భారీ ఫేమ్ తెచ్చిపెట్టింది. ఓ ఎమోషనల్ ఎంటర్టైనర్ ఆయన తెరకెక్కించిన తీరు కట్టిపడేసింది. కమర్షియల్ గా జెర్సీ భారీ సక్సెస్ కాకున్నా ఓ మోస్తరు విజయాన్ని నమోదు చేసింది. యూనివర్సల్ సబ్జెక్టు కావడంతో హిందీలో కూడా రీమేక్ చేశారు. అయితే అక్కడ దారుణ పరాజయం చవిచూసింది. తెలుగులో నాని చేయగా హిందీలో షాహిద్ కపూర్ చేశారు. 

హిందీ వర్షన్ కి కూడా గౌతమ్ దర్శకత్వం వహించారు. జెర్సీ మూవీ చూశాక ఇంప్రెస్ అయిన రామ్ చరణ్ ఆఫర్ ఇచ్చాడు. చరణ్ కోసం ఓ స్పోర్ట్స్ డ్రామా గౌతమ్ సిద్ధం చేసినట్లు, ఆయన ఇంప్రెస్ అయినట్లు వార్తలొచ్చాయి. అంతా బాగానే ఉంది వచ్చే ఏడాది ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుందని భావిస్తున్న తరుణంలో ప్రాజెక్ట్ హోల్డ్ లో పడ్డట్లు వార్తలొస్తున్నాయి. స్క్రిప్ట్ తో పాటు బడ్జెట్ సమస్యల కారణంగా ఈ ప్రాజెక్ట్ ఆయిపోయింది అంటున్నారు. 

రామ్ చరణ్ ఈ ప్రాజెక్ట్ యూవీ క్రియేషన్స్ బ్యానర్లో చేయాల్సి ఉంది. దీంతో రామ్ చరణ్ కోసం మరో దర్శకుడిని వెతికే పనిలో నిర్మాతలు ఉన్నారట. మరోవైపు రామ్ చరణ్ ఆర్ సి15 నుండి బ్రేక్ తీసుకున్నారు. దర్శకుడు శంకర్ భారతీయుడు 2 షూటింగ్ తిరిగి ప్రారంభించారు. కమల్ తో చేస్తున్న భారతీయుడు సీక్వెల్ షూట్ ముగిసే వరకు రామ్ చరణ్ మూవీ సెట్స్ పైకి వెళ్ళదు. ఈ గ్యాప్ లో ఆయన స్క్రిప్ట్స్ వింటున్నారట.   

ఆర్ ఆర్ ఆర్ మూవీతో రామ్ చరణ్ పాన్ ఇండియా ఇమేజ్ సొంతం చేసుకున్నారు. ఆ క్రమంలో తన ప్రస్తుత ఇమేజ్ కి తగ్గట్టు కథలు ఎంచుకుంటున్నారు. శంకర్-రామ్ చరణ్ మూవీపై భారీ అంచనాలున్నాయి. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా, దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ మూవీలో రామ్ చరణ్ మూడు భిన్నమైన పాత్రల్లో కనిపిస్తారని సమాచారం. 
 

PREV
click me!

Recommended Stories

Illu Illalu Pillalu Today Episode Feb 12: రైస్ మిల్లు ఓనర్‌గా వల్లి, నర్మద సాగర్‌ను ఛీ కొట్టిన రామరాజు దంపతులు
Gunde Ninda Gudi Gantalu: ఫంక్షన్ లో మటన్ ముక్కల కోసం గొడవ, పోయిన బాలు పరువు..రోహిణీ మాజీ భర్త ఎంట్రీ