ఓటు మన బాధ్యత, మన పవర్‌, మన హక్కు.. ఇప్పటికైనా రియలైజ్‌ కావాలిః `ఇస్మార్ట్ శంకర్‌` రామ్‌

Published : Dec 01, 2020, 01:47 PM ISTUpdated : Dec 01, 2020, 02:04 PM IST
ఓటు మన బాధ్యత, మన పవర్‌, మన హక్కు.. ఇప్పటికైనా రియలైజ్‌ కావాలిః `ఇస్మార్ట్ శంకర్‌` రామ్‌

సారాంశం

`ఇస్మార్ట్ శంకర్‌` ఫేమ్‌ హీరో రామ్‌ పోతినేని తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో షేక్‌ పేటలోని ఎమ్మార్వో ఆఫీస్‌లో తమ ఓటుని వేశారు. మాస్క్ ధరించి, కరోనా నియమాలను పాటిస్తూ ఓటుని వేశారు. 

తారలు తరలి వస్తున్నారు. మొదట్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు నెమ్మదిగా వచ్చిన సెలబ్రిటీలు ఇప్పుడు కాస్త జోరు పెంచారు. వరుసగా యంగ్‌ హీరోలు ఓటు హక్కుని వినిపించుకునేందుకు ముందుకు వస్తున్నారు. తమ సామాజిక బాధ్యతని, ఓటు విలువని చాటుతున్నారు. 

`ఇస్మార్ట్ శంకర్‌` ఫేమ్‌ హీరో రామ్‌ పోతినేని తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో షేక్‌ పేటలోని ఎమ్మార్వో ఆఫీస్‌లో తమ ఓటుని వేశారు. మాస్క్ ధరించి, కరోనా నియమాలను పాటిస్తూ ఓటుని వేశారు. ఓ పోలీస్‌ రామ్‌కి షేక్‌ హ్యాండ్‌ ఇచ్చేందుకు ప్రయత్నించినా కాదని, నమస్కారం పెట్టడం విశేషం. కరోనా వెళ్లలేదు ఇంకా ఉందన్నారు.

ఈ సందర్భంగా రామ్‌ మీడియా ముందు మాట్లాడుతూ, `ఓటు వేయడం మన బాధ్యత, మన హక్కు, మన పవర్‌. ఓటు వేయాలని చెబితే జరిగేది కాదు, రియలైజ్‌ అయి రావాలి. తమ బాధ్యతని చాటుకోవాలి` అని చెప్పారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 : తనూజ తో ఐటమ్ సాంగ్ చేయిస్తానన్న ఇమ్మాన్యుయేల్, అడ్డంగా బుక్కైన డీమాన్ పవన్.. హౌస్ లో చివరి రోజు సందడి
Emmanuel Remuneration: ఇమ్మూ రెమ్యూనరేషన్‌ మైండ్‌ బ్లోయింగ్‌.. బిగ్‌ బాస్‌ తెలుగు 9 షోకి ఎంత తీసుకున్నాడంటే?