
ఎనర్జిటిక్ హీరో రామ్ నటించిన 'హలో గురు ప్రేమకోసమే' సినిమా మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హీరో రామ్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలలో తన సినిమాను ఎన్టీఆర్ 'అరవింద సమేత'తో పోలుస్తూ ఒక ఉదాహరణ చెప్పాడు.
''హలో గురు ప్రేమకోసమే సినిమా కథలో పాయింట్ అందరికీ తెలిసిందే. ఎక్కడినుండో తీసుకొచ్చిన కాన్సెప్ట్ కాదిది. కానీ తెలిసిన కథనే కొత్తగా చెప్పాం. సినిమాలో గంట పాటు కామెడీ ఉంటుంది.
అది కూడా ఇరికించినట్లు కాకుండా కథ ప్రకారమే ఉంటుందని'' చెబుతూ తన సినిమాలో కాన్సెప్ట్ పాతదే అయినా టేకింగ్ కొత్తగా ఉంటుందని సమర్ధించుకున్నారు రామ్. దీనికి అరవింద సమేతని ఉదాహరణగా చెబుతూ.. అరవింద సమేతలో కాన్సెప్ట్ కూడా కొత్తది కాదని, టేకింగ్ చాలా కొత్తగా ఉందని అన్నారు.
తమ సినిమా కూడా అలానే ఉంటుందని వెల్లడించారు. త్రినాధరావు నక్కిన డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా కనిపించనుంది!
ఇది కూడా చదవండి..
అమ్మాయిలు నన్ను చూసి కుళ్లుకుంటారు.. ఏమంటావ్ అనుపమ?