నాగ చైతన్య బెస్ట్ హిట్ అందుకుంటాడా?

Published : Oct 16, 2018, 04:46 PM IST
నాగ చైతన్య బెస్ట్ హిట్ అందుకుంటాడా?

సారాంశం

అక్కినేని వారసుడిగా నాగ చైతన్య తన కెరీర్ లో ఇంకా భారీ స్థాయిలో హిట్స్ అందుకోలేకపోతున్నాడు. ఒక లెవెల్లో ఇప్పటివరకు లవర్ బాయ్ గా ప్రేమ కథలతో క్రేజ్ ను కాపాడుకుంటూ వస్తున్నాడు.

అక్కినేని వారసుడిగా నాగ చైతన్య తన కెరీర్ లో ఇంకా భారీ స్థాయిలో హిట్స్ అందుకోలేకపోతున్నాడు. ఒక లెవెల్లో ఇప్పటివరకు లవర్ బాయ్ గా ప్రేమ కథలతో క్రేజ్ ను కాపాడుకుంటూ వస్తున్నాడు. కానీ మాస్ ఆడియెన్స్ ని పూర్తి స్థాయిలో తన వైపుకు తిప్పుకోలేకపోతున్నాడు. గత ఏడాది రారండోయ్ వేడుక చూద్దాం సినిమాతో హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. 

అయితే ఆ వెంటనే యుద్ధం శరణం సినిమాతో మళ్ళీ ఫ్లాప్ అందుకున్నాడు. రీసెంట్ గా వచ్చిన శైలజా రెడ్డి అల్లుడు కూడా పెద్దగా మెప్పింలేకపోయింది. అయితే నెక్స్ట్ చైతూ ఫుల్ యాక్షన్ సినిమా సవ్యసాచితో రాబోతున్నాడు. తనకు ప్రేమమ్ లాంటి బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన చందు మొండేటి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. డిఫరెంట్ కాన్సెప్ట్ అలాగే విజువల్ ఎఫెక్ట్స్ కూడా సినిమాలో అలరిస్తాయని తెలుస్తోంది. 

సినిమాపై ఓ వర్గం ప్రేక్షకుల్లో అంచనాలు బాగానే ఉన్నాయి. కొంచెం పాజిటివ్ టాక్ వచ్చినా దీపావళి సీజన్ లో బాక్స్ ఆఫీస్ ను ఈ చిత్రం బ్లాస్ట్ చేయగలదు. మాధవన్ చిత్రంలో విలన్ గా కనిపించనున్నాడు. ఇక భూమిక ముఖ్య పాత్రలో నటించారు. నవంబర్ 2న సినిమాను రిలీజ్ చేయనున్నారు. మరి ఈ డిఫరెంట్ యాక్షన్ సినిమా ఏ స్థాయిలో కలెక్షన్స్ ను రాబడుతుందో చూడాలి. 

PREV
click me!

Recommended Stories

49 ఏళ్ల వయసులో ఇండియాకు మెడల్ సాధించిన నటి, ఏకంగా 4 పతకాలతో మెరిసిన ప్రగతి
Rithu Remuneration బిగ్ బాస్ విన్నర్ రేంజ్ లో పారితోషికం, రీతూ చౌదరి ఎలిమినేషన్ కు కారణాలు ఇవే ?