సుజీత్-పవన్ ఓజీ పై అదిరిపోయే అప్డేట్..!

Published : Jul 12, 2023, 07:48 AM IST
సుజీత్-పవన్ ఓజీ పై అదిరిపోయే అప్డేట్..!

సారాంశం

పవన్ కళ్యాణ్ వరుస ప్రాజెక్ట్స్ ప్రకటించారు. అవన్నీ సెట్స్ పై ఉన్నాయి. కాగా ఓజీ నాలుగో షెడ్యూల్ కి రంగం సిద్ధమైంది. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది.   

హీరో పవన్ కళ్యాణ్ నటించిన బ్రో విడుదలకు సిద్ధం అవుతుండగా మరో మూడు ప్రాజెక్ట్స్ సెట్స్ పై ఉన్నాయి. అలాగే విడతల వారీగా ఏపీలో వారాహి యాత్ర చేస్తున్నాడు. ప్రస్తుతం రెండో దశ వారాహి యాత్ర జరుగుతుంది. హరి హర వీరమల్లు షూటింగ్ మొదలవుతుందని అంటున్నారే కానీ ఆ దాఖలాలు లేవు. పవన్ ఎక్కువ సమయం ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాలకు కేటాయిస్తున్నారు. ఉస్తాద్, ఓజీ చిత్రాలు దాదాపు యాభై శాతం షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు సమాచారం. 

తాజాగా ఓజీ యూనిట్ ఎగ్జైటింగ్ అప్డేట్ ఇచ్చారు. మూడు షెడ్యూల్స్ కంప్లీట్ అయిన నేపథ్యంలో నాలుగో షెడ్యూల్ కి సిద్ధం అవుతున్నారట. హైదరాబాద్ లోనే ఈ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారట. పవన్ కళ్యాణ్ తో పాటు ప్రధాన తారాగణం పాల్గొననుందట. ఇది లాంగ్ షెడ్యూల్ అని తెలుస్తుంది. వారాహి రెండో దశ యాత్ర ముగిసిన వెంటనే పవన్ కళ్యాణ్ ఓజీ షూటింగ్ లో పాల్గొనే అవకాశం కాలేదు. 

నిర్మాత డివివి దానయ్య నిర్మిస్తుండగా సాహో ఫేమ్ సుజీత్ తెరకెక్కిస్తున్నారు. వర్కింగ్ టైటిల్ గా ఓజీ అని పెట్టారు. ఓజీ అనగా ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ అని అర్థం. ఇది ముంబై, జపాన్ నేపథ్యంలో సాగే గ్యాంగ్ స్టర్ డ్రామా అని సమాచారం. పవన్ కళ్యాణ్ కి జంటగా ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తుంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లో ఈ చిత్రంపై భారీ హైప్ నెలకొంది. 

కాగా బ్రో విడుదలకు సిద్ధమైంది. జులై 28న వరల్డ్ వైడ్ విడుదల చేయనున్నారు. పవన్ కళ్యాణ్-సాయి ధరమ్ తేజ్ ల ఈ మల్టీస్టారర్ కి సముద్ర ఖని దర్శకుడు. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటలు అందించారు. తమిళ చిత్రం వినోదయ సితం రీమేక్. పవన్ మోడ్రన్ గాడ్ గా కనిపిస్తారని తెలుస్తుంది. ఆయన పాత్ర నిడివి చాలా తక్కువగా ఉంటుందట. థమన్ సంగీతం అందించారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Ustaad Bhagat Singh: ప్రోమోతోనే దుమ్ములేపుతున్న `దేఖ్‌ లేంగే సాలా` సాంగ్‌.. పవన్‌ కళ్యాణ్‌ మేనియా స్టార్ట్
2025 Top 5 Heroes: 1000 కోట్లతో టాప్‌లో ఉన్న నటుడు ఇతనే.. రిషబ్‌, మోహన్‌ లాల్‌, విక్కీ, అక్షయ్‌లకు ఝలక్‌