
ఒకప్పుడు వరుస సినిమాలతో తెలుగు తెరపై సంచలనంగా మారాడు ప్రముఖ నటుడు ఆశిష్ విద్యార్ధి., తెలుగు ప్రేక్షకులకు అతని గురించి పరిచయం చేయాల్సిన పని లేదు. మహేశ్ బాబు హీరోగా పూరీ జగన్నాథ్ డైరెక్ట్ చేసిన సెన్సేషనల్ తెలుగు ఫిల్మ్ పోకిరి లో ఆయన పాత్ర ఎంత హైలెట్ అయ్యిందో అందరికి తెలిసిందే.. ఈసినిమాతో ఆశిష్ విద్యార్ధి కి మంచి గుర్తింపు వచ్చింది. ఆతరువాత విలన్ గానే కాకుండా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా.. ఎన్నో పాత్రల్లో ఒదిగిపోయాడు.
ఇక రీసెంట్ గా ఆశిష్ విద్యార్ధి రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. 57 ఏళ్ల ఆశిష్ విద్యార్థి... అస్సాంకు చెందిన 33 ఏళ్ల ఫ్యాషన్ ఎంటర్‌ప్రెన్యూర్ రూపాలీ బరువా ను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. కోల్‌కతాలో జరిగిన వీరి పెళ్ళికి ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు... అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ఈక్రమంలో ఈ ఇద్దరు ప్రస్తుతం హనీమూన్ ను ఎంజాయ్ చేస్తున్నారు.
తాజాగా ఆశిష్, రూపాలీ బరువా ఇద్దరు హనీమూన్‌కి వెళ్లారు. ఇండోనేషియాలోని బాలిలో హనామూన్ ట్రిప్ ను ఏకాంతంగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను రూపాలి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. చుట్టూ పచ్చదనం, ఆహ్లాదకరమైన కొండల మధ్య దిగిన ఫోటోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
అయితే ఇది వీరికి రెండో హనీమూన్ ట్రిప్. ఎందుకంటే.. గత నెలలో వీరు సింగపూర్‌లో ఫస్ట్ హనీమూన్ జరుపుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ ఏజ్ లో ఆశిష్.. ఇలా హనీమూన్ కు వెళ్లడంపై.. నెటీజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ముసలోడే కానీ.. మహానుభావుడు అంటూ అతడు సినిమాలో డైలాగ్ ను ఆశీష్ కు సింక్ చేస్తూ.. మీమ్స్ చేస్తూన్నారు. ఆశిష్ రెండో పెళ్లిపై ఎన్నో విమర్శలు వచ్చాయి. వాటిపై ఆయన స్పందించాడు. తనపై వస్తున్న విమర్శలు అన్ని విన్నానని, పెళ్లి చేసుకోవడం అంటే కేవలం శారీరక సుఖం కోసం మాత్రమే కాదని, ఒక తోడు కోసం చేసుకుంటారని, తాను అలాంటి తోడు కోసమే చేసుకున్నట్లు వివరణ ఇచ్చారు. ఇక గతంలో ఆశిష్..నటి శకుంతల బరువా కూతురు రాజోషి బరువాను పెళ్లి చేసుకోగా వీరికి అర్త్ విద్యార్థి అనే కొడుకు ఉన్నాడు. అయితే.. విబేధాల కారణంగా వీరు విడిపోయారు.