మోక్షజ్ఞ ఎంట్రీ.. ఏ సినిమాతోనో, ఎప్పుడో క్లారిటీ ఇచ్చిన బాలయ్య

Published : Jul 11, 2023, 07:50 PM IST
మోక్షజ్ఞ ఎంట్రీ.. ఏ సినిమాతోనో, ఎప్పుడో క్లారిటీ ఇచ్చిన బాలయ్య

సారాంశం

ప్రస్తుతం సినిమాల్లోకి వచ్చేందుకు మోక్షజ్ఞ ప్రిపేర్‌ అవుతున్నాడట. నటన పరంగా ట్రైన్‌ అవుతున్నట్టు తెలిపారు. వచ్చే ఏడాది మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ ఉంటుందన్నారు.


నందమూరి అభిమానులు ఎప్పటి నుండో బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం కళ్లుకాయలు ఎదురుచూస్తున్న  సంగతి తెలిసిందే. గత  కొంతకాలంగా ఇదిగో ఎంట్రీ..అదిగో ఎంట్రీ అంటున్నారు తప్ప అధికారికంగా మాత్రం మోక్షజ్ఞ ఎంట్రీ ఫై క్లారిటీ ఇవ్వడం లేదు. అయితే ప్రతీ చోటా అభిమానులు, మీడియావారు బాలయ్య ను ఈ విషయమై క్లారిటీ అడుతున్నారు. ఈ నేపధ్యంలో తాజాగా అమెరికా వెళ్లి తానా సభల్లో పాల్గొన్నానారు. అక్కడ ఈ విషయమై క్లారిటీ ఇచ్చారు.

 తన తనయుడు మోక్షజ్ఞ తేజ (Mokshagna) ఎంట్రీపై  ఇంట్రస్టింగ్ కామెంట్స్  చేశారు  నందమూరి బాలకృష్ణ (Balakrishna).  తన కుమారుడిని వచ్చే ఏడాది టాలీవుడ్‌లోకి పరిచయం చేయనున్నట్లు చెప్పారు. అయితే, ఆ చిత్రానికి దర్శకుడు ఎవరనేది మాత్రం బాలయ్య చెప్పలేదు. అయితే ఏ సినిమాతో లాంచ్ అవుతారనే విషయమై క్లారిటీ ఇచ్చారు. 

బాలయ్య ఈ ఈవెంట్ లో ఆఫ్ ది రికాడ్ లో మాట్లాడుతూ... తన కుమారుడు మోక్షజ్ఞ తేజ ని ఆదిత్య 369 సీక్వెల్ తో పరిచయం చేస్తానని అన్నారు. అయితే ఇందుకు సంభందించిన పనులు మాత్రం ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ అనంతరం మొదలవుతాయని అన్నారు. అంటే వచ్చే సంవత్సరం ఈ లాంచ్ ఉంటుందన్నమాట. బాలయ్య ప్రధాన పాత్రలో కనిపించగా,  మోక్షజ్ఞ తేజ మాత్రం ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నారని చెప్పారు.  ఇక మోక్షజ్ఞను బోయపాటి శ్రీను లాంచ్‌ చేయనున్నారంటూ వస్తోన్న వార్తలపై ఆయన మాట్లాడుతూ.. ‘‘అంతా దైవేచ్ఛ’’ అని నవ్వి ఊరుకున్నారు. వ ప్రస్తుతం మోక్షజ్ఞ అమెరికా లో యాక్షన్ కోర్స్  చేస్తున్నాన్నాడు. వచ్చే ఏడాది మోక్షజ్ఞ ఎంట్రీ గ్యారెంటీ అంటున్నారు.  
   

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Allu Arjun `డాడీ` మూవీ చేయడం వెనుక అసలు కథ ఇదే.. చిరంజీవి అన్న ఆ ఒక్క మాటతో
Bigg Boss Telugu 9: లవర్‌కి షాకిచ్చిన ఇమ్మాన్యుయెల్‌.. కప్‌ గెలిస్తే ఫస్ట్ ఏం చేస్తాడో తెలుసా.. తనూజ ఆవేదన