హీరో నిఖిల్ నిజంగా రాజకీయాల్లోకి వెళుతున్నారా.. అసలు మ్యాటర్ ఇదే

Published : Mar 31, 2024, 10:04 AM IST
హీరో నిఖిల్ నిజంగా రాజకీయాల్లోకి వెళుతున్నారా.. అసలు మ్యాటర్ ఇదే

సారాంశం

రెండ్రోజుల నుంచి హీరో నిఖిల్ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చినట్లు అంతటా చర్చ జరుగుతోంది. నిఖిల్ యువకుడే. ఎంతో భవిష్యత్తు ఉన్న టాలీవుడ్ హీరో. పైగా ఇప్పుడు పాన్ ఇండియా చిత్రాలతో దూసుకుపోతున్నాడు.

రెండ్రోజుల నుంచి హీరో నిఖిల్ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చినట్లు అంతటా చర్చ జరుగుతోంది. నిఖిల్ యువకుడే. ఎంతో భవిష్యత్తు ఉన్న టాలీవుడ్ హీరో. పైగా ఇప్పుడు పాన్ ఇండియా చిత్రాలతో దూసుకుపోతున్నాడు. ఇలాంటి తరుణంలో రాజకీయాల్లోకి వెళ్లడం అంటే కెరీర్ ని పణంగా పెట్టడమే. 

దీనితో నిఖిల్ పొలిటికల్ ఎంట్రీపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. రెండ్రోజుల క్రితం హీరో నిఖిల్.. చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ని కలిశారు. నారా లోకేష్.. నిఖిల్ కి టిడిపి కండువా కప్పి ఆహ్వానించారు. దీనితో నిఖిల్ పొలిటికల్ ఎంట్రీ కంఫర్మ్ అనే వార్తలు మొదలయ్యాయి. అయితే అసలు మ్యాటర్ ఇప్పుడు బయటకి వచ్చింది. 

స్వయంగా నిఖిల్ దీనిపై క్లారిటీ ఇచ్చారు. తాను రాజకీయాల్లోకి వెళ్లడం లేదని.. ఏ పార్టీలో చేరడం లేదని నిఖిల్ స్పష్టం చేశారు. అయితే నారా లోకేష్ ని కలవడానికి ఒక కారణం ఉందని తెలిపారు. నిఖిల్ మామగారు ఎంఎం కొండయ్య యాదవ్ త్వరలో జరగబోయే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. తన మామగారికి టికెట్ ఇచ్చినందుకు స్వయంగా నిఖిల్.. నారా లోకేష్ ని కలసి కృతజ్ఞతలు తెలిపారు. 

ఆ సందర్భంలో లోకేష్ ఆప్యాయంగా నిఖిల్ మెడలో టిడిపి కండువా వేశారు. అది నారా లోకేష్ కి థ్యాంక్స్ చెప్పేందుకు జరిగిన భేటీ తప్ప పార్టీలో చేరేందుకు కాదు అని నిఖిల్ స్పష్టం చేశారు. తన నిఖిల్ తన మామగారి తరుపున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారో లేదో అనేది క్లారిటీ లేదు. ప్రస్తుతం నిఖిల్ స్వయంభు అనే చిత్రంలో నటిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్
ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?