
నేచురల్ స్టార్ నాని (Nani) - శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) దర్శకత్వంలో ‘దసరా’ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. రా అండ్ రస్టిక్ క్యారెక్టర్ తో అలరించారు. మీడియం సినిమాగానే వచ్చిన బ్లాక్ బాస్టర్ హిట్ అందుకుంది. నాని కెరీర్ లోనే ఈ చిత్రం వంద కోట్లను కలెక్ట్ చేయడం విశేషం. ఇక రెండోసారి మళ్లీ ఈ క్రేజీ కాంబో రిపీట్ కాబోతోంది. నాని 33వ చిత్రం Nani33ని తాజాగా అనౌన్స్ చేశారు. దసరా వచ్చి ఏడాది దాటిన సందర్భంగా ఈ మూవీని అధికారికంగా ప్రకటించారు. అనౌన్స్ మెంట్ పోస్టర్ చాలా ఆసక్తకరంగా ఉంది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో సినిమా ఉండబోతోందని అర్థమవుతోంది. ‘లీడర్ కావాలంటే నీకు గుర్తింపు ఉండాల్సిన అవసరం లేదు’ అంటూ ఇచ్చిన క్యాప్షన్ ఆసక్తిని పుట్టిస్తోంది.
విరించి వర్మ ‘జితేందర్ రెడ్డి’ మూవీ రిలీజ్ డేట్..
బాహుబలి సినిమాతో జాతీయ స్థాయిలో ప్రేక్షకుల మన్ననలు పొందిన రాకేష్ వర్రే, గతంలో ‘ఎవ్వరికీ చెప్పొద్దు’ సినిమాతో హీరో, నిర్మాతగా మారిన సంగతి అందరికీ తెలిసిందే, రీసెంట్ గా నిర్మాతగా ‘పేకమేడలు’ చిత్రం టీజర్ను లాంచ్ చేసి మంచి కథలు, కొత్త కథలను ప్రేక్షకులకు అందించాలని చేసే ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు ‘జితేందర్ రెడ్డి’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొని వస్తున్నారు. గతంలో రిలీజ్ చేసిన ప్రోమోకి, అస్సలు ఎవరు ఈ జితేందర్ రెడ్డి అని ? అని హీరో పేస్ రెవీల్ చెయ్యకుండా విడుదల చేసిన పోస్టర్స్ కూడా మంచి ఆదరణ పొందాయి.. ముదుగంటి క్రియేషన్స్ బ్యానర్ లో రాబోతున్న ఈ జితేందర్ రెడ్డి సినిమా రిలీజ్ డేట్ ను చిత్ర యూనిట్ ఈరోజు విడుదల చేసింది. 2024 May 3న ఈ చిత్రం విడుదల కాబోతుంది అని చిత్ర దర్శకుడు విరించి వర్మ చెప్పారు.