విజయ్ దేవరకొండకు మెగాస్టార్ అండ, అప్పుడు గీత గోవిందం, ఇప్పుడు ఫ్యామిలీ స్టార్...

By Mahesh JujjuriFirst Published Mar 31, 2024, 7:30 AM IST
Highlights

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండకు అండగా నిలబడుతున్నాడు మెగాస్టార్ చిరంజీవి.  గతంలో కూడా తన సినిమాలకు సపోర్ట్ చేసిన చిరు.. తాజాగా ఫ్యామిలీ స్టార్ కోసం కదలిరాబోతున్నారు. 

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా..  నటిస్తున్న సరి కొత్త సినిమా ఫ్యామిలీ స్టార్. దిల్ రాజు నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని పరుశురాం డైరెక్ట్ చేస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈమూవీ రూపొందుతోంది. అంతే కాదు గతంలో విజయ్ దేవరకొండకు గీతగోవిందం సినిమాతో సూపర్ హిట్ అందించాడు  పరుశురాం. వీరి కాంబినేషన్ లో వస్తున్నమూవీ కావడంతో ఫ్యామిలీ స్టార్ పై మంచి  అంచనాలే ఉన్నాయి. 

ఇక ఆ అంచనాలను అందుకోవడం కోసం విజయ్ అండ్ పరుశురాం బాగా కష్టపడుతున్నారు. ఇక అన్ని కార్యక్రమాలను కంప్లీట్ చేసుకుని ఫ్యామిలీ స్టార్ మూవీ  ఏప్రిల్ 5న ఆడియన్స్ ముందుకు రాబోతుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో  ప్రమోషన్లకు పదును పెట్టారు టీమ్. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఏప్రిల్ 2న ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలని టీం నిర్ణయించారని తెలుస్తోంది. అయితే ఈ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ ఎవరనేది ఆసక్తికరంగా మారింది. 

ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా రాబోతున్నారని ఇప్పటి వరకూ ఉన్న సమాచారం. గతంలో కూడా విజయ్ దేవరకొండకు అండగా నిలిచాడు మెగాస్టార్ చిరంజీవి.  గీతగోవిందం సక్సెస్ మీట్ కి చిరంజీవి హాజరయ్యి విజయ్ ని అభినందించారు. ఇక ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ మూవీ ప్రీ రిలీజ్ కు చిరంజీవి ముఖ్య అతిథిగా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. టీమ్ అయితే అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు.. చేస్తారేమో చూడాలి. 

చాలా కాలంగా ఫెయిల్యూర్స్ తో బాధపడుతున్న విజయ్ దేవరకొండ ఫార్ములా మార్చి.. మాస్ హీరో నుంచి.. ప్యామిలీ హీరోగా మారి సినిమాలు చేస్తున్నాడు. ఆ ఫార్ములాతోనే ఖుషి సినిమా మంచి సక్సెస్ ను ఖాతాలో వేసుకుంది. ఇక ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ ఎలాఉంటుందో చూడాలి. ఫ్యాన్స్ మాత్రం గీతగోవిందం కాంబినేషన్ పైనే అన్ని హోప్స్ పెట్టుకున్నారు. మరి ఆ ఆశలు విజయ్ నిలబెడతాడా లేదా అనేది చూడాలి. 

 

click me!