డైహార్ట్ ఫ్యాన్ కు అదిరిపోయే గిఫ్ట్ పంపిన నవీన్ పొలిశెట్టి.. ఏమిచ్చాడంటే..?

Published : Aug 20, 2023, 03:26 PM IST
డైహార్ట్ ఫ్యాన్ కు అదిరిపోయే గిఫ్ట్ పంపిన నవీన్ పొలిశెట్టి.. ఏమిచ్చాడంటే..?

సారాంశం

ఎక్కడైనా తమ అభిమాన స్టార్స్ కోసం ఖరీదైనర బహుమతులు పంపించడం చూస్తూ ఉంటాం. కాని ఓస్టార్ హీరో.. ఓ అభిమానికి గిఫ్ట్ పంపించడం ఎప్పుడైనా విన్నారా..? 


ఇండస్ట్రీలో ఈమధ్య వారసులు ఎక్కువైపోయారు.. కాని అదే టైమ్ లో ఎటువంటి  సినిమా బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టి.. సూపర్ సక్సెస్ అయినవారు కూడా ఉన్నారు. అలాంటి వారిలో  టాలెంటెడ్ యాక్టర్ నవీన్ పోలిశెట్టి కూడా ఒకరు. కెరీర్ బిగినింగ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చిన్న చిన్న పాత్రలు చేసిన నవీన్.. ఆతరువాత హీరోగా అవతరించి.. తన టాలెంట్ తో  ప్రేక్షకులను మెప్పించాడు. ముఖ్యంగా ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' మూవీతో హీరోగా మారి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం యంగ్ హీరో నటిస్తున్న మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా వచ్చే నెలలో రిలీజ్ కు రెడీ అవుతోంది. మరో విశేషం ఏంటంటే.. ఈసినిమాలో హీరోయిన్ గా అనుష్క శెట్టి సందడి చేయబోతోంది.

ఇక నవీన్ కు జాతిరత్నాలు సినమా తో ఫ్యాన్స్ గట్టిగా పెరిగిపోుయారు. జాతి రత్నాలు' సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ తరువాత నవీన్ పోలిశెట్టి క్రేజ్ నెక్స్ట్ లెవల్ కు చేరిపోయింది. టాలీవుడ్ లోని బడా నిర్మాతలు నవీన్ తో  సినిమాలు చేయడానికి ముందుకు వస్తున్నారు. మరోవైపు యూత్ లో అతనికున్న ఫాలోయింగ్ చూసి పలు కంపెనీలు బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టుకోడానికి సై అంటున్నాయి.. ఈమధ్యే ట్విల్స్ అనే ఫ్యాషన్ బ్రాండ్‌ నవీన్ ను తమ అంబాసిడర్ గా ప్రకటించింది. ఈ విషయాన్ని నవీన్ పొలిశెట్టి  రీసెంట్ గా  ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.

ఇప్పుడు తన అభిమాని అడిగాడని ఒక షర్ట్ ని గిఫ్ట్ గా పంపించి నెటిజన్ల దృష్టిని ఆకర్షించాడు నవీన్. అలసు విషయం ఏంటీ అంటే.. పోలిశెట్టి నవీన్ ట్వీట్ చేస్తూ.. ''భారతదేశంలోని ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్‌లలో ఒకటైన ట్విల్స్ లో వారి బ్రాండ్ అంబాసిడర్‌గా చేరడానికి చాలా సంతోషిస్తున్నాను. ట్విల్స్ X నవీన్ పోలిశెట్టి  కలెక్షన్ ఇప్పుడు వారి అన్ని స్టోర్‌లలో అందుబాటులో ఉంటుందని చెప్పడానికి ఆనందంగా ఉంది. కాబట్టి, ఇప్పుడే షాపింగ్ చేయడానికి మీ సమీపంలోని ట్విల్స్ స్టోర్‌కి వెళ్లండి'' అని ఆ బ్రాండ్ ను ప్రమోట్ చేశాడు. 

అంతే కాదు మీరు కూడా నాలాగే మీకు నచ్చిన బట్టలు వేసుకోండి అంటూ తాన ఫ్యాషన్ డ్రెస్ లతో కూడాన ఫోటోలను తన సోషల్ మీడియాలో శేర్ చేశాడు నవీన్.. నవీన్ ట్వీట్ కి ఓ అభిమాని స్పందిస్తూ, 'మీరు వేసుకున్న షర్ట్ నాకు బాగా నచ్చింది.. అది గిఫ్ట్ గా ఇవ్వొచ్చుగా అన్నా. అది ఎక్కడ దొరుకుంటుందో లింక్ అయినా ఇవ్వన్నా' అని నవీన్ ను కోరాడు. దీనికి యువ హీరో రియాక్ట్ అవుతూ చొక్కా పంపిస్తాను, కాంటాక్ట్ డీటెయిల్స్ సెండ్ చేయమని అన్నాడు. అయితే చెప్పినట్లుగానే తన ఫ్యాన్ కి షర్ట్ ను బహుమతిగా పంపించారు. 

తన అభిమాన నటుడు ఇలా తన కు షర్ట్ ను బహుమతిగా పంపించడంతో.. దిల్  ఖుషీ అయిన అతను తన ఫేవరేట్ హీరోకి థ్యాంక్స్ చెబుతూ, ఈ విషయాన్ని ట్విట్టర్ లో పంచుకున్నాడు. 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' సినిమా చాలా పెద్ద అవ్వాలని కోరుకున్నట్లు చెప్పాడు. నవీన్ పోలిశెట్టి దీనికి స్పందిస్తూ 'యూ ఆర్ వెల్ కమ్' అని రిప్లై  కూడా ఇచ్చారు.

PREV
click me!

Recommended Stories

రానా దగ్గుబాటి కెరీర్ లో టాప్ 10 సినిమాలు, అస్సలు మిస్ కాకూడదు.. ఇలాంటి పాత్రలు చేయగలిగిన ఏకైక నటుడు
Balakrishna: నిజమే, పవన్ కళ్యాణ్ కోసం బాలయ్య త్యాగం.. ఓజీ గెలిచింది ఇప్పుడు అఖండ 2 గెలవాలి