
రీసెంట్ గా దుల్కర్ సల్మాన్(Dulquer Salman) తాజా చిత్రం కింగ్ అఫ్ కోత(King of Kotha) ప్రమోషన్ లో రానా అన్న మాటలు వైరల్ అయ్యాయి. ఈ సినిమా తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా ఈ ఈవెంట్ కి రానా(Rana), నాని(Nani) ఇద్దరూ గెస్టులుగా వచ్చారు. ఈ ఈవెంట్లో రానా మాట్లాడుతూ ఓ బాలీవుడ్(Bollywood) హీరోయిన్ గురించి విమర్శలు చేశాడు. దుల్కర్ తో ఓ బాలీవుడ్ హీరోయిన్ సినిమా చేసిందని, ఆమె సినిమా చేసేటప్పుడు దుల్కర్ ని చాలా ఇబ్బంది పెట్టిందని, షూటింగ్ మధ్యలో ఫోన్స్ మాట్లాడుకుంటుందని, ఈ విషయంలో నిర్మాతలని తిట్టానని రానా చెప్పాడు.ఆమె మరెవరో కాదని సోనమ్ కపూర్ అని తర్వాత అందరికీ అర్దమైంది. రానా వ్యాఖ్యలు వైరల్ అవ్వగా ఇవి సోనమ్ వరకూ వెళ్లాయి. బాలీవుడ్ లో కూడా సోనమ్ ని విమర్శించిన రానా అని వార్తలు వచ్చాయి. దాంతో రానా క్షమాపణలు చెప్తూ ట్వీట్ చేసాడు.
రానా తన ట్వీట్ లో.. నేను మాట్లాడిన మాటలతో సోనమ్ పై బాగా వ్యతిరేకత చూపిస్తున్నారు. అది నాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఆమె కూడా నా స్నేహితురాలే. నేను సరదాగానే ఆ వ్యాఖ్యలు చేశాను. నా మాటలు తప్పుగా అర్ధం చేసుకొని ప్రమోట్ చేసినందుకు నేను చాలా బాధపడుతున్నాను. నేను గౌరవంగా భావించే సోనమ్ కపూర్ కి, దుల్కర్ సల్మాన్ కి నా హృదయపూర్వక క్షమాపణలు తెలియచేస్తున్నాను. ఇప్పటికైనా ఈ ఊహాగానాలకు, వార్తలకు ముగింపు పలకాలని కోరుకుంటున్నాను. అర్ధం చేసుకుంటారని కోరుకుంటూ ధన్యవాదాలు అని తెలిపాడు. దీంతో ఈ ట్వీట్ మరింత వైరల్ అయింది. దీనిపై సోనమ్ ఇండైరెక్ట్ గా ఓ కొటేషన్ కూడా పోస్ట్ చేసింది.
ఇక తాజాగా రానా చేసిన వ్యాఖ్యలపై దుల్కర్ స్పందించాడు. కింగ్ అఫ్ కొత్త ప్రమోషన్స్ లో దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ.. అవి రానా వ్యక్తిగత వ్యాఖ్యలు. నేను దానిపై మాట్లాడాలనుకోవట్లేదు. నాకు పరిశ్రమలో చాలా మంది మంచి స్నేహితులు ఉన్నారు. రానా కూడా ఒకరు. నేను ఎవరిపై కంప్లైంట్ చేయను. నా పని నేను చేసుకొని వెళ్ళిపోతాను. రానా ఆ విషయాన్ని కావాలని అయితే చెప్పి ఉండరు. స్టేజిపైకి వచ్చాక నా గురించి మాట్లాడుతూ చెప్పారు. అందుకే ఆయన తర్వాత క్షమాపణలు కూడా చెప్పారు అని అన్నారు.