Latest Videos

వైరల్ వీడియో: నాగ చైతన్య చేతుల్లోకి ప్రభాస్ బుజ్జి.. అసలు ఏం జరుగుతుంది?

By Sambi ReddyFirst Published May 25, 2024, 4:43 PM IST
Highlights


బుజ్జి ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పేరు. కల్కి మూవీలో హీరో ప్రభాస్ వాహనమే బుజ్జి. ఇంజినీర్లులు కల్కి మూవీ కోసం ప్రత్యేకంగా ఈ వాహనాన్ని రూపొందించారు. నాగ చైతన్య బుజ్జి కార్ ని డ్రైవ్ చేశాడు. తన ఫీలింగ్ పంచుకున్నాడు. 
 

కల్కి మూవీలో బుజ్జి వాహనానికి ఎంత ప్రాధాన్యత ఉందో తెలియదు కానీ... భారీగా ప్రమోట్ చేస్తున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన ప్రమోషనల్ ఈవెంట్లో ప్రభాస్ ఈ వాహనంలో ఎంట్రీ ఇచ్చాడు. ఇక బుజ్జిని పరిచయం చేస్తూ స్పెషల్ ప్రోమో కూడా కట్ చేశారు. కల్కి చిత్రంలో ప్రభాస్ భైరవ రోల్ చేస్తున్నాడు. ఆయన వాహనమే ఈ బుజ్జి.  కాగా బుజ్జి కారును నాగ చైతన్య నడిపారు. తన అనుభూతిని పంచుకున్నాడు. 

నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. ఇంజనీరింగ్ నియమాలను బుజ్జి బ్రేక్ చేసిందని నాగ చైతన్య అన్నాడు. సదరు కారులో వాయువేగంతో దూసుకుపోయాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. బుజ్జి ఫ్యూచరిస్టిక్ కారు. అది ప్రభాస్ తో మాట్లాడుతుంది. ఆయన ఆదేశాల ప్రకారం నడుచుకుంటుంది. అప్పుడప్పుడు వేధిస్తుంది. 

కాగా బుజ్జి నిర్మాణం వెనుక పలువురు ఇంజనీర్స్ కృషి ఉంది. మహీంద్రా అండ్ జయేమ్ ఆటోమోటివ్ సంస్థలు సంయుక్తంగా ఈ కారును రూపొందించాయి. దర్శకుడు నాగ్ అశ్విన్ కల్కి మూవీలో ఉపయోగించే వాహనాల తయారీకి తమ ఇంజనీర్స్ సహాయం కావాలని ఆనంద్ మహీంద్రాను కోరారు. అందుకు ఆయన అంగీకారం తెలిపారు. చెప్పినట్లే బుజ్జి ని రూపొందించడానికి ఆయన సాంకేతిక పరిజ్ఞానం సమకూర్చారు. 

ఇక బుజ్జి ఇంజనీరింగ్ డీటెయిల్స్ వివరిస్తూ ఓ వీడియో వైరల్ అవుతుంది. మూడు చక్రాలు ఉండే బుజ్జి కారు టైర్స్ చాలా ప్రత్యేకంగా తయారు చేశారు. రిమ్ హైట్ 34.5 అంగుళాలు. ఈ భారీ టైర్స్ రూపొందించడానికి చాలా సమయం పట్టింది. రిమ్స్ కూడా అసాధారణమైనవి. హబ్ లెస్ టైర్స్ వాడారు. టైర్ బేరింగ్స్ సహాయంతో ముందుకు కదులుతుంది. ఇలా రూపొందించడానికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అవసరం. టైర్స్ తయారీకి సియట్ కంపెనీ ముందుకు వచ్చింది. 

ఈ కారు బరువు దాదాపు 6 వేల కేజీలు. పవర్ 94 కిలో వాట్స్, టార్క్ 9800NM , బ్యాటరీ 47kwh . కారులో ప్రత్యేకమైన ఓ ఛాంబర్ ఉంటుంది. అందులో హీరో శత్రువులను బందీలుగా అందులో ఉంచుతాడట. కారు వెనుక భాగంలో ఒక టైర్ మాత్రమే ఉంటుంది. అది అన్ని కోణాల్లోకి తిరుగగలదు. ఈ కారు నిర్మాణానికి ఎంత ఖర్చు అయ్యిందనేది మాత్రం తెలియరాలేదు. కాగా కల్కి జూన్ 27న విడుదల కానుంది. 
 

Look who's met ... , hope you had a fantastic time. pic.twitter.com/8odhpYDqMz

— Vyjayanthi Movies (@VyjayanthiFilms)
click me!