Latest Videos

రాంచరణ్ ని కలసిన వెట్రి మారన్.. కథ విన్నాడు కానీ ?

By tirumala ANFirst Published May 25, 2024, 2:15 PM IST
Highlights

మెగా పవర్ స్టార్ రాంచరణ్ వరుసగా పాన్ ఇండియా చిత్రాలు సెట్ చేసుకునే పనిలో ఉన్నారు,. ప్రస్తుతం చరణ్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ చిత్రంలో నటిస్తున్నాడు. 

మెగా పవర్ స్టార్ రాంచరణ్ వరుసగా పాన్ ఇండియా చిత్రాలు సెట్ చేసుకునే పనిలో ఉన్నారు,. ప్రస్తుతం చరణ్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ చిత్రంలో నటిస్తున్నాడు. ఆ తర్వాత బుచ్చిబాబు దర్శకత్వంలో భారీ బడ్జెట్ లో ఒక చిత్రం తెరకెక్కబోతోంది. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది.  

ఈ మూవీలో రాంచరణ్ తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించేందుకు రెడీ అవుతున్నట్లు టాక్. ఇదిలా ఉండగా రామ్ చరణ్ తదుపరి చిత్రానికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ జరిగింది. తమిళంలో కల్ట్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన వెట్రి మారన్ తాజాగా రాంచరణ్ ని కలసినట్లు వార్తలు వస్తున్నాయి. 

వెట్రి మారన్ తమిళంలో అసురన్, వాడ చెన్నై లాంటి అద్భుతమైన చిత్రాలు తెరకెక్కించారు. విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. హృదయాన్ని హత్తుకునే డీప్ రూటెడ్ డ్రామా లతో మెప్పించడం వెట్రి మారన్ శైలి. 

తాజాగా వెట్రి మారన్ రాంచరణ్ కి ఒక కథ వినిపించారట. చరణ్ ఆ కథ పాత్ర చాలా ఇంప్రెస్ అయినట్లు తెలుస్తోంది. కానీ కన్ఫర్మేషన్ ఇవ్వలేదట. త్వరలో మరోసారి మీట్ అవుదాం అన్నట్లుగా చెప్పినట్లు తెలుస్తోంది. స్టోరీలైన్ చాలా గ్రిప్పింగ్ గా ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే అది అన్ని విధాలుగా వర్కౌట్ అవుతుందా అనే కోణంలో రాంచరణ్ అనాలసిస్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. రాంచరణ్ ప్రస్తుతం రెగ్యులర్ కమర్షియల్ చిత్రాల పట్ల ఏమాత్రం ఆసక్తిగా లేదట. పాత్ బ్రేకింగ్ కథలపట్లే ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. 

click me!