Latest Videos

అల్లు అర్జున్ నంద్యాల పర్యటన ..ఇద్దరు కానిస్టేబుల్స్ పై వేటు

By Surya PrakashFirst Published May 25, 2024, 4:12 PM IST
Highlights

 అల్లు అర్జున్ నంద్యాల నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి, తన స్నేహితుడు శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన విషయం తెలిసిందే.


అల్లు అర్జున్ నంద్యాల పర్యటన కేసులో మరో ట్విస్ట్ పడింది.  స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుళ్లు.. స్వామి నాయక్, నాగరాజుని వీఆర్ కి పంపించటం ఆసక్తికరమైన సంఘటనగా ఇప్పుడు అంతటా చర్చనీయాంశంగా మారింది.  వివరాల్లోకి వెళితే...

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ముందు అల్లు అర్జున్ నంద్యాల నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి, తన స్నేహితుడు శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన విషయం తెలిసిందే.అల్లు అర్జున్ నంద్యాల పర్యటన వివాదంగా మారింది. కుటుంబంలనూ చిచ్చు పెట్టింది. ఇక ముందస్తు అనుమతి లేదన్న కారణంగా అల్లు అర్జున్, నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిపై కేసులు నమోదయ్యాయి. ఇప్పుడీ కేసు మరో మలుపు తిరిగింది. 

పోలీసులు అలసత్వం వహించారంటూ ఇద్దరు సిబ్బందిపై ఈసీ చర్యలు తీసుకుంది. స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుళ్లు.. స్వామి నాయక్, నాగరాజుని వీఆర్ కి పంపించారు. ఈ ఘటన జరిగి రెండు వారాలవుతుండగా.. ఇప్పుడు పోలీస్ కానిస్టేబుళ్లపై వేటు పడటం విశేషం. ఇక ఇదే సంఘటనపై ఎస్పీ రఘువీర్ రెడ్డి, డీఎస్పీ రవీందర్ రెడ్డి, టూ టౌన్ సీఐ రాజారెడ్డిలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు కూడా జారీ చేసింది. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నప్పటికీ భారీగా జన సమీకరణ జరగడంపై ఈసీ సీరియస్ అయింది.

పైస్థాయి అధికారులపై చర్యలు లేకుండా కింది స్థాయి సిబ్బందిపై వేటు వేయడంపై జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. అయితే 60 రోజుల్లో శాఖ పరమైన విచారణకూడా చేయాలని సూచించినట్లు సమాచారం.
 
మరో ప్రక్క అల్లు అర్జున్ నంద్యాల పర్యటన మెగా ఫ్యామిలీలో కూడా చిచ్చు రేపింది. బన్నీపై నాగబాబు వేసిన ట్వీట్ కలకలంరేపగా ఆయన కొద్ది రోజులు పాటు ట్విట్టర్ కి కూడా గుడ్ బై చెప్పాల్సి వచ్చింది.అలాగే బన్నీ వైసీపీకి బహిరంగంగా మద్దతు తెలపడంతో పవన్ కల్యాణ్ అభిమానులకు, బన్నీ అభిమానులకు సోషల్ మీడియాలో పెద్ద వార్ జరిగింది.

click me!