
కొత్తజంట మనోజ్ మంచు, మౌనిక రెడ్డి హైదరాబాద్ రేస్ క్లబ్ ని సందర్శించారు. నిర్వాహకులు ఏర్పాటు చేసిన హార్స్ రేస్ వీక్షించారు. ట్రాక్ పై పరుగులు పెట్టే గుర్రాలను చూసి ఎంజాయ్ చేశారు. ప్రముఖులకు మాత్రమే ఆహ్వానం ఉంటుందని సమాచారం. ఈ హార్స్ రేస్ కి మంచు లక్ష్మి, రామ్ వీరపనేని, నిఖిల్ విజయేంద్ర సింహతో పాటు పలువురు సెలెబ్స్ హాజరయ్యారు. ఫొటోలకు పోజిచ్చారు. మంచు లక్ష్మి, మౌనికల ట్రెండీ లుక్ వైరల్ అవుతుంది .
మార్చి 3న మంచు మనోజ్ తో మౌనిక వివాహం జరిగింది. అక్క మంచు లక్ష్మి పెళ్లి పెద్దగా తన నివాసంలో వివాహ వేడుక నిర్వహించింది. మనోజ్ పెళ్లి కార్యక్రమాల్లో విష్ణు, మోహన్ బాబు పాల్గొనలేదు. మోహన్ బాబు చివరి నిమిషంలో హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించాడు. విష్ణుతో మనోజ్ కి వివాదాలు కొనసాగుతున్నాయి. మంచు లక్ష్మి సైతం విష్ణును దూరం పెట్టింది. ఇటీవల మనోజ్ కి మాత్రమే రాఖీ కట్టిన మంచు లక్ష్మి మరో తమ్ముడు విష్ణును విస్మరించింది.
మంచు వారసుల మధ్య పెద్ద గొడవలే జరిగాయని సమాచారం. ముఖ్యంగా ఆస్తుల పంపకాల విషయంలో తేడాలు వచ్చాయంటున్నారు. మోహన్ బాబు, విష్ణు ఒకవైపు... మనోజ్, లక్ష్మి మరొకవైపు ఉంటున్నారు. మనోజ్ వివాహం చేసుకున్న మౌనికకు పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉంది. ఇక మౌనిక-మనోజ్ మొదటి పెళ్లిళ్లు కానప్పటి నుండే మిత్రులు. తమ తమ భాగస్వాములతో విడాకులు తీసుకుని ఇప్పుడు ఒక్కటయ్యారు.