రష్మిక కాళ్ళు మొక్కిన అసిస్టెంట్... సోషల్ మీడియాలో రచ్చ!

Published : Sep 04, 2023, 12:52 PM ISTUpdated : Sep 04, 2023, 12:57 PM IST
రష్మిక కాళ్ళు మొక్కిన అసిస్టెంట్... సోషల్ మీడియాలో రచ్చ!

సారాంశం

హీరోయిన్ రష్మిక మందాన తన మేకప్ అసిస్టెంట్ సాయి వివాహానికి హాజరయ్యారు. ఈ వేడుకలో రష్మిక కాళ్ళను అసిస్టెంట్ మొక్కడం హాట్ టాపిక్ అయ్యింది. 

ఇటీవల రజనీకాంత్(Rajinikanth) యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కాళ్లకు నమస్కరించారు. ఇది అత్యంత వ్యతిరేకతకు దారితీసింది. వయసులో తనకంటే చిన్నవాడైన ఆదిత్యనాథ్ కాళ్లకు రజనీకాంత్ మొక్కడమేంటని సోషల్ మీడియాలో చర్చ జరిగింది. దీనిపై చివరకు రజినీకాంత్ వివరణ ఇవ్వాల్సి వచ్చింది. వయసులో చిన్నవాడైనా కానీ ఆదిత్యనాథ్ ఒక యోగి. అందుకే నేను కాళ్లకు నమస్కరించానని అన్నారు. 

కాగా ఇదే విషయంలో హీరోయిన్ రష్మిక మందాన(Rashmika Mandanna)ఒకింత విమర్శలు ఎదుర్కొంటుంది. పెళ్లి కాని 27 ఏళ్ల రష్మిక కాళ్ళను ఆమె అసిస్టెంట్ మొక్కాడు. రష్మిక మేకప్ అసిస్టెంట్ సాయి వివాహం హైదరాబాద్ లో జరిగింది. ఈ వేడుకకు రష్మిక స్వయంగా హాజరయ్యారు. రష్మికను చూసిన అసిస్టెంట్ సాయి సతీసమేతంగా కాళ్ళకు మొక్కాడు. రష్మిక కొంచెం ఇబ్బందిపడుతూనే వారిని ఆశీర్వదించింది. ఎంత అసిస్టెంట్ అయితే మాత్రం పెళ్లి కానీ అమ్మాయి కాళ్లు మొక్కడం ఏంటంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

అయితే సాయి తన మేడం రష్మికను అంతగా గౌరవించాడు అంటే... కారణం ఉండకపోదు. బహుశా సాయిని ఆర్థికంగా రష్మిక ఆదుకొని ఉండవచ్చు. లేదంటే మరో విధంగానైనా సాయం చేసి ఉండొచ్చు. అందుకే ఆమె కాళ్లకు అసిస్టెంట్ మొక్కి ఆశీర్వాదం తీసుకొని ఉండొచ్చు. అందులోనూ ఆమె కావాలని కాళ్ళు మొక్కించుకోలేదు. ఈ విషయంలో రష్మికను తప్పుబట్టాల్సింది లేదని... పలువురు కామెంట్స్ చేస్తున్నారు. 

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక రష్మిక మందాన చేతిలో రెండు భారీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అల్లు అర్జున్ కి జంటగా పుష్ప 2 చేస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుపుకుంటుంది. అలాగే రన్బీర్ కపూర్ కి జంటగా యానిమల్ మూవీ చేస్తుంది. ఈ చిత్రానికి సందీప్ రెడ్డి వంగా దర్శకుడు కావడంతో అంచనాలు ఏర్పడ్డాయి. రైన్ బో టైటిల్ తో రష్మిక ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీ చేస్తుంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Sobhan Babu `సోగ్గాడు` మూవీతో పోటీ పడి దెబ్బతిన్న ఎన్టీఆర్‌.. శివాజీ గణేషన్‌కైతే చుక్కలే
Illu Illalu Pillalu Today: వల్లి పెట్టిన చిచ్చు, ఘోరంగా మోసపోయిన సాగర్, భర్త చెంప పగలకొట్టిన నర్మద